Rayapati Sambasiva Rao: టీడీపీ నేతకు పెద్ద షాక్.. ఆస్తుల వేలాని రంగం సిద్దం

Update: 2020-02-22 04:00 GMT
రాయపాటి సాంబశివరావు ఫైల్ ఫోటో

టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు భారీ షాక్ తగిలింది. ఆయన ఆస్తుల వేలానికి రంగం సిద్దమైంది. రాయపాటికి చెందిన ఆస్తులను వేలం వేయబోతున్నట్టు ఆంధ్రాబ్యాంక్‌ గురువారం పత్రికప్రకటన జారీ చేసింది. గుంటూరు, న్యూఢిల్లీలోని ఆస్తులు వేలం వేస్తున్నట్లు ప్రకటనలో పేర్కొంది. ఆయన ఆంధ్రబ్యాకుకు రూ.837.37 కోట్ల విలువైన అప్పులు ఉన్నాయని, చెల్లించకపోవడంతో మార్చి 23వ తేదీన ఆస్తులు వేలం వేస్తున్నట్లు ఆంధ్రాబ్యాంక్ పేర్కొంది.

గుంటూరు నగరంలోని అరండల్‌పేటలోని 22,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న భవనం‌తో పాటు, న్యూఢిల్లీలోని ఫ్లాట్‌ను వేలం వేస్తున్నట్లు పేర్కొంది. అయితే ఉన్న ఆస్తులకు మధ్య అప్పులకు అస్సలు పొంతన లేనట్టు తెలుస్తోంది. గుంటూరులోని బిల్డింగ్ విలువను రూ.16.44 కోట్లు నిర్ధారించగా.., ఢిల్లీలోని ఫ్లాట్‌ను రూ.1.09 కోట్లుగా నిర్ధారించినట్లు సమాచారం. ఆంధ్రా బ్యాంకు నుంచి ట్రాన్స్‌ట్రాయ్‌ ఇండియా పేరుతో పాటు, రాయపాటి రంగారావు, మల్లినేని సాంబశివరావు, దేవికారాణి, లక్ష్మి, చెరుకూరి శ్రీధర్ పేరిట రుణాలు తీసుకున్నారు.

ఈ రుణానికి పూచీకత్తుగా రంగారావు, దేవికారాణి, నారయ్యచౌదరి, రాయపాటి జగదీష్‌, రాయపాటి జీవన్, యలమంచలి జగన్‌మోహన్‌, లక్ష్మి, సీహెచ్‌ వాణి ఉన్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఆంధ్రా బ్యాంక్‌(Andhrabank.in) వెబ్‌సైట్‌ లేదా టెండర్స్‌ డాట్‌ జీవోవీ డాట్‌ ఇన్‌(Tenders.gov.in)ను సంప్రదించాల్సిందిగా బ్యాంకు ప్రకటనలో తెలిపింది.




 


 

Tags:    

Similar News