చంద్రబాబు కాన్వాయ్ ని అడ్డుకున్న విద్యార్థి జేఏసీ

కర్నూలు జిల్లాలోని పార్టీ నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహించడానికి కర్నూలు చేరుకున్న చంద్రబాబు నాయుడిని రాయలసీమ విద్యార్థి సంఘాల నాయకులు, జెఎసి నాయకులు అడ్డుకున్నారు.

Update: 2019-12-02 11:31 GMT

కర్నూలు జిల్లాలోని పార్టీ నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహించడానికి కర్నూలు చేరుకున్న చంద్రబాబు నాయుడిని రాయలసీమ విద్యార్థి సంఘాల నాయకులు, జెఎసి నాయకులు అడ్డుకున్నారు. బాబు గో బ్యాక్ నినాదాలతో చంద్రబాబునాయుడు కాన్వాయ్ కి ఎదురుగా పరుగెత్తారు. దీంతో పోలీసులు, జెఎసి నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. హైకోర్టును లేదా రాజధానిని రాయలసీమకు మార్చడానికి అనుకూలంగా ప్రకటన చేసిన తరువాతే చంద్రబాబు కర్నూలు జిల్లాలోకి ప్రవేశించాలని విద్యార్థి సంఘాలు జెఎసి డిమాండ్ చేసింది.

కాగా పార్టీ బలోపేతమే లక్ష్యంగా సోమవారం నుంచి మూడురోజులపాటు కర్నూలు చంద్రబాబు పర్యటన సాగిస్తున్నారు. నియోజకవర్గాల వారీగా నేతలతో సమీక్షలు నిర్వహించి భవిష్యత్‌ వ్యూహాలపై వారికి దిశానిర్దేశం చేస్తున్నారు. తొలిరోజు ఆదోని, మంత్రాలయం, ఎమ్మిగనూరు, డోన్‌, నందికొట్కూరు నియోజకవర్గాల నేతలతో సమీక్ష నిర్వహించారు. రేపు ఆళ్లగడ్డ, కోడుమూరు, ఆలూరు, పత్తికొండ, నంద్యాల నేతలతో విడివిడిగా చర్చించనున్నారు. ఎల్లుండి బనగానపల్లె, పాణ్యం, శ్రీశైలం, కర్నూలు నియోజకవర్గాల నేతలతో చంద్రబాబు సమావేశం నిర్వహించనున్నారు.

Tags:    

Similar News