రవితేజ చెప్పిన రహస్యాలు కొత్తవేమీ కాదు: ఎంపీ విజయసాయిరెడ్డి

జనసేన పార్టీ మాజీ వ్యవస్థాపక అధ్యక్షులు, ఆ పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి రాజా రవితేజ.. జనసేన పార్టీ సభ్యత్వానికి, పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

Update: 2019-12-15 07:34 GMT
రాజా రవితేజ, విజయసాయిరెడ్డి

జనసేన పార్టీ మాజీ వ్యవస్థాపక అధ్యక్షులు, ఆ పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి రాజా రవితేజ.. జనసేన పార్టీ సభ్యత్వానికి, పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా మీడియా సమావేశంలో మాట్లాడిన రవితేజ తాను జనసేన నుంచి ఎందుకు బయటకు వస్తున్నాడో కారణాలు వివరించాడు. పార్టీ స్థాపించిన నాడు, ప్రస్తుతం పవన్‌కల్యాణ్‌లో చాలా మార్పులు వచ్చాయని, ఆయన ప్రసంగాల్లో ద్వేషం, కోపం కనిపిస్తుందని, కుల, మతాల ప్రస్తావనలు తెస్తున్నారని ఆరోపించారు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో వ్యూహాత్మకంగా వ్యవహరించకపోవడం వల్లే జనసేన ఘోరంగా ఓడిపోయిందని వ్యాఖ్యానించారు.

పవన్ కళ్యాణ్ ఒక్కడికోసమే పార్టీని నడిపిస్తున్నారని విమర్శించిన రవితేజ.. పవన్ ప్రవర్తనలో మార్చురాకపోతే రాబోయే రోజుల్లో కూడా జనసేన పార్టీ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అయితే జనసేనకు రవితేజ రాజీనామా చేసిన విషయం, దిశ చట్టంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడారు. ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఉద్ద్యేశించి విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు చేశారు.

రాజా రవితేజ చెప్పిన రహస్యాలు కొత్తవేమీ కాదన్నారు ఆయన. అంతేకాదు ఆయన పవనిజం పుస్తకాన్ని పవన్ రాయలేదన్న విషయాన్ని కూడా ఎవరూ నమ్మలేదని అన్నారు. గోస్ట్ రైటర్ రాస్తే పేరు పెట్టుకోవడం సినిమా వాళ్లకు తెలిసిన విద్యే. స్పీచ్ లు, సోషల్ మీడియా కామెంట్లన్నీ బ్యాక్ గ్రౌండ్లో ఎవరో రాస్తున్న సంగతి తెలియనిదేమీ కాదని వ్యాఖ్యానించారు విజయసాయి. ఇటు దిశ చట్టం విషయంలో చంద్రబాబును అనుసరిస్తున్న వైఖరిపై ఆయన మండిపడ్డారు.

ఏపి దిశ చట్టంపై కేంద్రం సహా అన్ని రాష్ట్రాలు ఆరా తీస్తున్నాయి. మహిళలు,పసి పిల్లలపై ఘోరాలు జరిగితే ప్రచారం కోసం వాడుకోవడం తప్ప చంద్రబాబునాయుడు ఏనాడు కఠిన చట్టాలు తేలేదని అన్నారు. ఈ యాక్ట్ వల్ల నేరగాళ్లకు 21 రోజుల్లోనే ఉరికంబం ఎక్కుతారని సీఎం జగన్ ఇచ్చిన భరోసా మహిళల్లో ధైర్యం నింపిందని చెప్పారు. కాగా శని ఆదివారం రెండు రోజులపాటు విజయసాయిరెడ్డి పార్టీ కార్యాలయంలో నేతలకు అందుబాటులో ఉన్నారు.


Tags:    

Similar News