Ramatheertham issue: రామతీర్థంలో కొనసాగుతున్న ఉద్రిక్తత
Ramatheertham issue: * బీజేపీ, జనసేన ధర్మయాత్రకు అడుగడుగునా ఆటంకాలు * అనుమతిలేదంటూ పలువురు హౌస్ అరెస్ట్ * పోలీస్ వలయాలు దాటుకొని రామతీర్థం చేరుకున్న బీజేపీ నేతలు
Somu Veerraju
బీజేపీ, జనసేన ధర్మయాత్రతో రామతీర్థం కాస్తా రణరంగంలా మారిపోయింది. రామతీర్థంలో ర్యాలీలకు అనుమతి లేదంటూ పోలీసులు బీజేపీ, జనసేన ధర్మయాత్రకు అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తున్నారు. పోలీస్ వలయాలు దాటుకొని రామతీర్థం చేరుకున్న బీజేపీ నేతలు సోము వీర్రాజు, ఎమ్మెల్సీ మాధవ్‌ను అడ్డుకున్నారు.
ప్రభుత్వం తీరుపై సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్మయాత్రకు అనుమతిలేదంటూ అడ్డుకోవడం దారుణమని ఆయన మండిపడ్డారు. సీఎం జగన్‌కు చిత్తశుద్ధి ఉంటే ఆలయాలపై దాడులను నియంత్రించాలన్నారు. వరుస ఘటనలకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి వెల్లంపల్లి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆలయాలపై దాడులకు పాల్పడినవారిని వెంటనే అరెస్ట్ చేయాలని లేనిపక్షంలో ఆందోళనలు మరింత ఉద్రిక్తం చేస్తామని హెచ్చరించారు సోము వీర్రాజు.