విశాఖ రాజధానికి మద్దతుగా పాయకరావుపేటలో వైసీపీ ర్యాలీ

విశాఖపట్నంను కార్యనిర్వాహణ రాజధానికి మద్దతుగా ఎమ్మెల్యే గొల్ల బాబూరావు ఆధ్వర్యంలో పట్టణంలో వైసీపి శ్రేణులు ర్యాలీ నిర్వహించారు.

Update: 2020-01-11 14:10 GMT

పాయకరావుపేట: విశాఖపట్నంను కార్యనిర్వాహణ రాజధానికి మద్దతుగా ఎమ్మెల్యే గొల్ల బాబూరావు ఆధ్వర్యంలో పట్టణంలో వైసీపి శ్రేణులు ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబు ఉత్తరాంధ్ర ద్రోహి అంటూ నినిదాలు చేశారు. ఒక్క రాజధాని వద్దు మూడు రాజధానిలు ముద్దు అంటూ గళమెత్తారు.

అభివృద్ది వికేంద్రీకరణ ముద్దంటూ ప్లకార్జులు ప్రదర్శించారు. స్థానిక గౌతమ్ సెంటర్ నుండి జాతీయ రహదారి 'వై' జంక్షన్ వరకు జరిగిన ర్యాలీ నందు అధిక సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...విశాఖను ఎక్జిక్యూటివ్ కేపిటల్ చేయడం వలన ఉత్తరాంధ్రతో పాటు ఉభయ గోదావరి జిల్లాలు అభివృద్ది చెందుతాయని అన్నారు.

Tags:    

Similar News