కోస్తాంధ్రకు వర్ష సూచన

Update: 2019-11-15 02:11 GMT

ఇప్పటికే భారీ వర్షాలతో ఏపీలోని నదులు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. ఈ క్రమంలో మరోసారి వర్షం పలకరించడానికి వస్తోంది. తూర్పు, ఈశాన్యం నుంచి వీస్తున్న గాలులతో రాగల రెండు, మూడు రోజులు అనేక ప్రాంతాల్లో పొడి వాతావరణ నెలకొంటుందని దాంతో కోస్తా, రాయలసీమలోని కొన్నిప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. కోస్తాలో శుక్రవారం అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. నెల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో గురువారం మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. 

Tags:    

Similar News