వాయుగుండంగా తీవ్ర అల్పపీడనం..

Update: 2019-11-05 05:31 GMT

ఇప్పటికే భారీ వర్షాలతో అల్లాడుతున్న ఆంధ్రప్రదేశ్ కు వానముప్పు ఇప్పట్లో తప్పేలా లేదు.. బంగాళాఖాతంలో ఆదివారం అర్ధరాత్రి వరకు కొనసాగిన తీవ్ర అల్పపీడనం కాస్తా వాయుగుండంగా మారింది. ప్రస్తుతం ఉత్తర అండమాన్ పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉంది. ఇది క్రమంగా బలపడే అవకాశం ఉన్నట్టు వాతావరణ కేంద్రం వెల్లడిస్తోంది. వాయుగుండం రానున్న 24 గంటల్లో తుపానుగా మారే అవకాశం ఉందని తెలిపారు. ఒరిస్సా పారాదీప్‌కు దక్షిణ ఆగ్నేయంగా 950 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఇది క్రమంగా బలపడి ఒరిస్సా లేదా పశ్చిమబెంగాల్ తీరం వైపు వెళ్లే అవకాశాలున్నాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడతాయని చెబుతున్నారు. కాగా ఇప్పటికే రుతుపవనాల ప్రభావంతో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. 

Tags:    

Similar News