Bharat Jodo Yatra: ఏపీలో ప్రవేశించిన రాహుల్ జోడో యాత్ర
Bharat Jodo Yatra: కర్నూల్ జిల్లాలో క్షేత్రగుడి నుంచి ప్రారంభమైన జోడో యాత్ర
Bharat Jodo Yatra: ఏపీలో ప్రవేశించిన రాహుల్ జోడో యాత్ర
Bharat Jodo Yatra: కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర.. ఏపీలోకి ప్రవేశించింది. కర్నూల్ జిల్లాలోని క్షేత్ర గుడి నుంచి జోడో యాత్ర ప్రారంభమైంది. కాంగ్రెస్ పార్టీ నేతలు రాహుల్ గాంధీకి ఘన స్వాగతం పలికారు. ఆలూరు నిజియోజకవర్గంలోని చాగి గ్రామానికి రాహుల్ చేరుకున్నారు. రాహుల్ యాత్రలో కాంగ్రెస్ కార్యకర్తుల, నాయకులు భారీగా తరలివచ్చారు. పలు చోట్ల ఇళ్లపైకి ఎక్కి మరీ రాహుల్‌ను ప్రజలు ఆసక్తి చూస్తున్నారు.
కర్నూల్ జిల్లాలోని ఆలూరు, ఆదోని, ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గాల మీదుగా 119 కిలోమీటర్ల మేర రాహుల్ యాత్ర సాగనున్నది. ఏపీలో యాత్ర ముగిసిన తరువాత 23న తెలంగాణలోకి నారాయణపేట జిల్లాలోని గూడవల్లూరు గ్రామంలో ప్రవేశించనున్నది. సెప్టెంబరు 7న తమిళనాడులోని కన్యాకుమారిలో ప్రారంభమైన భారత్ జోడో యాత్ర 12 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల మీదుగా 3వేల 700 కిలోమీటర్ల మేర సాగనున్నది.