అధికార పార్టీలో రాచమల్లు రచ్చ.. ఎపిసోడ్‌కు ఎండ్‌ కార్డ్ పడేలా లేదా?

Rachamallu Siva Prasad Reddy: అధికార పార్టీలో రాచమల్లు రచ్చ నడుస్తోందట.

Update: 2021-12-07 08:18 GMT

అధికార పార్టీలో రాచమల్లు రచ్చ.. ఎపిసోడ్‌కు ఎండ్‌ కార్డ్ పడేలా లేదా? 

Rachamallu Siva Prasad Reddy: అధికార పార్టీలో రాచమల్లు రచ్చ నడుస్తోందట. చంద్రబాబు ఏడుపు ఎపిసోడ్‌ తర్వాత డ్యామేజ్‌ని కవర్‌ చేసుకుంటున్న వేళ రాచమల్లు కొత్త అలజడి రేపుతున్నారట. నారా భువనేశ్వరిపై వైసీపీ నేతలు అసభ్యకరంగా మాట్లాడారంటూ జరుగుతున్న వివాదాన్ని రాచమల్లు కొత్త మలుపు తిప్పారట. ఇంతకీ ప్రొద్దుటూరు ఎమ్మెల్యే చేసిన హడావిడి ఏంటి? ఆయన మాట్లాడిన మాటలు ఏంటి? భువనేశ్వరి గురించి రాచమల్లు చేసిన వ్యాఖ్యలు ఏంటి?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజుకో రకంగా వైరల్ అవుతున్నాయి. చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి ఎపిసోడ్‌కు ఇప్పట్లో ఎండ్‌ కార్డ్ పడేలా లేదన్న చర్చ జరుగుతోంది. సోషల్‌మీడియాలో దీనిపై పెద్దఎత్తున ట్రోల్స్‌ నడుస్తుండటం అధికార పార్టీ దీన్ని ప్రొటెక్ట్‌ చేసుకునే పనిలో పడటం, ఇమేజ్‌ డ్యామేజ్‌ కాకుండా కవర్‌ చేసుకుంటున్న వేళ ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ చేశారు.

అధికార పార్టీ నేతలు అహంకారంతో చంద్రబాబు ఫ్యామిలీ గురించి రంకెలు వేస్తున్నారంటూ తెలుగు తమ్ముళ్లు దీన్నో ఉద్యమంలా ముందుకు తీసుకెళ్తున్నారు. వారోత్సవాలంటూ గ్రామగ్రామన, ఇంటి ఇంటికి తిరిగి ఏం జరిగిందో చెబుతారు. మరోవైపు ఈ వివాదానికి ఇక్కడితో పుల్‌స్టాప్‌ పెట్టేందుకు వైసీపీ, మంత్రులు కౌంటర్‌ ఎటాక్‌ ఇస్తున్నారు. చంద్రబాబువి అన్నీ డ్రామాలని భువనేశ్వరిపై ఎవరూ ఏనాడూ అసభ్యకరమైన కామెంట్స్‌ చేయలేదని సమర్థించుకుంటున్నారు.

కరెక్ట్‌గా ఈ టైమ్‌లోనే వైసీపీకి చెందిన కడప జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి ఓ రచ్చ పెట్టారన్న చర్చ అధికార పార్టీలో జరుగుతోంది. ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. నారా భువనేశ్వరి విషయంలో తలెత్తిన ఘటనపై స్పందించిన రాచమల్లు కామెంట్స్‌ సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్‌ అవుతున్నాయి. అసెంబ్లీలో జరిగిన ఘటనలో నిజం ఉందని ఒప్పుకున్నంత పనిచేసిన రాచమల్లు దానికి తాను పశ్చాత్తాప పడుతున్నానంటూ ప్రకటించారు. ఇదే ఇప్పుడు ఫ్యాన్‌ పార్టీలో అలజడికి కారణమవుతోంది.

రాచమల్లు అన్నదేమింటే ఓ సోదరి వంటి మహిళను బజారుకీడ్చడం ఎంతో బాధాకరం చట్టసభలో ఓ మహిళను ఇలా బాధపెట్టడాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాని చెప్పుకొచ్చారు. తన కన్నీళ్లతో భువనేశ్వరి కాళ్లు కడుగుతానంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలే రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారగా, అదికార పార్టీలో దుమారం రేపుతున్నాయి. భువనేశ్వరిపై వల్లభనేని వంశీ చేసిన అనుచిత వ్యాఖ్యలను తోటి ఎమ్మెల్యేలుగా తామంతా తప్పు పడుతున్నామన్న రాచమల్లు వంశీ వైసీసీ ఎమ్మెల్యే కాదంటూ కొత్త ట్విస్టు ఇచ్చారు. అయినా వైసీపీ నాయకులు భువనేశ్వరి గురించి తప్పుగా మాట్లాడారని ప్రచారం చేయడం తగదంటూ రాచమల్లు కొత్తగా, సరికొత్తగా మాట్లాడారు.

ఈ పరిణామాలతో భువనేశ్వరి బాధపడి ఉంటే, తానే కాకుండా వైసీపీ ఎమ్మెల్యేలమంతా కలిసి ఆమె పాదాలను కన్నీళ్ళతో కడుగుతామంటూ రాచమల్లు చేసిన వ్యాఖ్యలు అధికార పార్టీలో దుమారం రేపుతున్నాయి. రాచమల్లు ఎందుకిలా మాట్లాడి ఉంటారన్న దానిపై వైసీపీ శ్రేణులు మథనపడుతున్నాయి. ఈ కామెంట్లతో రాచమల్లు వ్యక్తిగతంగా తాను ఇబ్బంది పడటమే కాకుండా ఫ్యాన్‌ పార్టీ శ్రేణుల్ని కూడా ఇబ్బందులకు గురి చేశారన్న టాక్‌ వినిపిస్తోంది. మరి ఈ దుమారం ఇక్కడితో ఆగుతుందా కంటిన్యూ అవుతుందా చూడాలి.

Tags:    

Similar News