నాగోల్‌లో కొత్త పోలీస్ స్టేషన్ ప్రారంభించిన రాచకొండ కమిషనర్
Nagole: నాగోల్ పోలీస్ స్టేషన్ కోసం 5 ఎకరాల స్థలం కేటాయించిన ఎమ్మెల్యే
నాగోల్‌లో కొత్త పోలీస్ స్టేషన్ ప్రారంభించిన రాచకొండ కమిషనర్
Nagole: పెరుగుతున్న అవసరాలకు తగ్గట్టుగా ఎల్బీనగర్ సమీపంలో నాగోల్ నూతన పోలీస్ స్టేషన్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. శాంతి భద్రతల దృష్ట్యా నాగోల్‌లో పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు సంబంధించిన ప్రయత్నాల్లో తాత్కాలిక ప్రాతిపదికన యువజన సంఘ భవనంలో ఏర్పాటు చేశారు. నాగోలు పరిసరాల్లో పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని భవనంకోసం అన్వేషిస్తున్న సమయంలో నవచైతన్య యువజన సంఘంకోసం ఏర్పాటుచేసిన భవనంలో తాత్కాలికంగా పోలీస్ స్టేషన్ ప్రారంభించారు. పోలీస్ స్టేషన్ శాశ్వత భవనం కోసం నాగోల్ లో 5 ఎకరాలు కేటాయించిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి రాచకొండ పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహన్ అభినందనలు తెలిపారు.