తిరుమల శ్రీవారి ఆలయంలో నేత్రపర్వంగా పుష్పయాగం

తిరుమల శ్రీవారి ఆలయంలో పుష్పయాగ మహోత్సవం నేత్రపర్వంగా జరిగింది. రంగు రంగుల పూలతో కలియుగ దైవాన్ని అర్చించారు. ఉదయం 9గంటల నుంచి 11గంటల వరకు ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం జరిపించారు.

Update: 2020-11-21 10:22 GMT

తిరుమల శ్రీవారి ఆలయంలో పుష్పయాగ మహోత్సవం నేత్రపర్వంగా జరిగింది. రంగు రంగుల పూలతో కలియుగ దైవాన్ని అర్చించారు. ఉదయం 9గంటల నుంచి 11గంటల వరకు ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం జరిపించారు. ఇక మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5గంటల స్వామి వారికి పుష్పార్చన నిర్వహించారు. పలు రకాల పూలు, పత్రాలతో స్వామివారిని అర్చించారు. తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక, తమిళనాడు నుంచి 7 టన్నుల పూలను టీటీడీ సేకరించింది. టీటీడీ ఉద్యోగులు, శ్రీవారి సేవకులు పూల గంపలను ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చారు. పుష్పయాగం సందర్భంగా ఆర్జితసేవలను టీటీడీ రద్దు చేసింది. 

Tags:    

Similar News