పొన్నూరు: రాజ్యాంగ విరుద్ధమైన ఎన్.ఆర్.సి, సి.ఎ.ఎ, ఎన్.పి.ఆర్ చట్టాలను వెంటనే రద్దు చేయాలని కోరుతూ పట్టణంలోని హైలాండ్ సెంటర్లో ముస్లిం మహిళలు, యువకులు పురుషులు పాల్గొని పెద్ద ఎత్తున నిరసన తెలిపి మానవహారం ఏర్పాటు చేశారు.
షరాబజార్ మార్కస్ మజీద్ ఐల్యాండ్ సెంటర్ వరకు ముస్లిం మహిళలు, పురుషులు ర్యాలీగా వచ్చి ఐలాండ్ సెంటర్ లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ చట్టాల వల్ల కేవలం ముస్లింలకే కాకుండా ప్రతి ఒక్కరికి ఇబ్బంది కలుగుతుందన్నారు. ఢిల్లీలోని షాహీన్ బాగ్ లో పౌరసత్వ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన దీక్ష చేస్తున్న ప్రతి ఒక్కరొకి మేము అండగా ఉంటామని తెలిపారు.