పవన్ వ్యాఖ్యలపై తిరుపతిలో వైసీపీ విద్యార్థి విభాగం ఆందోళన

*తిరుపతి ఎస్వీ యూనివర్శిటీ ఎదుట పవన్ దిష్టిబొమ్మ దహనం

Update: 2022-10-19 01:33 GMT

పవన్ వ్యాఖ్యలపై తిరుపతిలో వైసీపీ విద్యార్థి విభాగం ఆందోళన

Tirupati: జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో తిరుపతిలో వైఎస్ఆర్ సీపీ విద్యార్థి విభాగం ఆందోళనకు దిగింది. శ్రీవెంకటేశ్వర వి‌శ్వవిద్యాలయం గేటు ఎదుట పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మను దహనంచేశారు. ఈ విషయం తెలుసుకున్న జనసేన పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్‌ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి తరచూ విమర్శలు చేస్తున్న నాయకుల చిత్రపటాలతో నిరసనకు దిగారు. వైసీపీ నాయకుల చిట్రపటాలను దహనంచేసే ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. పోటాపోటీగా జరిగిన ఈఘటనతో పోలీసులు జోక్యంచేసుకుని ఇరువర్గాలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. జనసేన నాయకులను పోలీసులు అరెస్టుచేశారు.

Tags:    

Similar News