మాజీ డీజీపీ ఆర్పీ ఠాకూర్‌కు వ్యతిరేకంగా వెల్లువెత్తిన నిరసనలు

Update: 2019-07-09 08:08 GMT

మాజీ డీజీపీ ఆర్పీ ఠాకూర్‌కు వ్యతిరేకంగా తాడేపల్లిలోని సీఎం నివాసం వద్ద 13 జిల్లాల నుంచి వచ్చిన ఉద్యోగులు ఆందోళనకు దిగారు. టీడీపీ హయాంలో చంద్రబాబు మెప్పుకోసం అక్రమ కేసులు బనాయించారని ఆరోపించారు. టీడీపీ నేతలకు సహకరించలేదని డీజీపీగా ఉన్న సమయంలో ఆర్పీ ఠాకూర్ తమపై తప్పుడు కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ హయాంలో పెట్టిన కేసులను సమీక్షించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.

ఓవైపు 13 జిల్లాల నుంచి వచ్చిన ఉద్యోగులు సీఎం నివాసం ఎదుట ఆందోళన నిర్వహిస్తుంటే మాజీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ సచివాలయానికి వచ్చారు. సీఎంకు వివరణ ఇచ్చేందుకే సచివాలయానికి వచ్చినట్టు తెలుస్తోంది. డీజీపీ పదవి నుంచి తప్పించిన తర్వాత ఠాకూర్‌ను ప్రభుత్వం ప్రింటింగ్ అండ స్టేషనరీ డిపార్ట్‌మెంట్‌కు బదిలీ చేసింది.

Tags:    

Similar News