Ambati Rambabu: అంబటి వద్దు.. సొంత పార్టీలో అసమ్మతి
Ambati Rambabu: పార్టీ ఆదేశిస్తే పోటీ చేస్తానంటోన్న యర్రం వెంకటేశ్వర రెడ్డి
Ambati Rambabu: అంబటి వద్దు.. సొంత పార్టీలో అసమ్మతి
Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటికి సొంత పార్టీలో అసమ్మతి సెగలు రగులుతున్నాయి. సత్తెనపల్లి, రాజుపాలెంలో అంబటి వ్యతిరేక వర్గ నేతలు సమావేశమయ్యారు. మాజీ ఎమ్మెల్యే యర్రం వెంకటేశ్వరరెడ్డితో సమావేశమై ఆయన మద్దతు కోరారు. పార్టీ కోసం కష్టపడిన వారిని అంబటి ఇబ్బంది పెట్టారని ఆరోపిస్తున్నారు అంబటి వ్యతిరేక వర్గ నేతలు. స్థానికులకు సత్తెనపల్లి టికెట్ ఇవ్వాలని అధిష్టానాన్ని డిమాండ్ చేశారు. అంబటికి టికెట్ ఇస్తే తమ పదవులకు రాజీనామా చేస్తామంటోన్న నేతలు.. రాబోయే ఎన్నికల్లో అంబటి పోటీ చేస్తే ఓడిస్తామని హెచ్చరించారు.