అరకులోయలో సమస్యలను పరిష్కరిస్తాం

అరకులో పరిశుభ్రంగా ఉంచేందుకు చెత్తబుట్టలు ఏర్పాటు చేసుకోవాలని నోటీసులు అంటిచ్చినట్టు కార్యదర్శి శేఖర్ బాబు తెలిపారు.

Update: 2019-12-15 06:23 GMT
న్యాయమూర్తి సురేష్ కుమార్

అరకులోయ: ప్రముఖ పర్యాటక కేంద్రమైన అనుకూల వైఖరి ఏమిటో ఇబ్బందులు పడుతున్నామని, అధికారులు ఎటువంటి చర్యలు తీసుకొనడం లేదంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని లోక్ అదాలత్ న్యాయమూర్తి సురేష్ కుమార్ విచారించారు. అరకులోయలో పారిశుద్ధ్యం, ట్రాఫిక్ సమస్య, మాంసం దుకాణంలో ఆరోగ్యకరమైన జంతువుల మాంసం విక్రయించకపోవడం, ఘాట్ రోడ్డులో ప్రమాదకర రహదారి, ప్రధాన రహదారులపై న్యాయవాది ప్రభాకర్ రావు దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారణను న్యాయమూర్తి సంబంధిత అధికారుల నుంచి లిఖితపూర్వక హమిని తీసుకున్నారు.

ఇప్పటికే ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు వీలుగా ప్రధాన రహదారితో పాటు పర్యాటక ప్రాంతాలైన వ్యూ పాయింట్, ఇతర ప్రదేశాల వద్ద సిబ్బందిని నియమించినట్లు సీఐ పైడయ్య పేర్కొన్నారు. అరకులో పరిశుభ్రంగా ఉంచేందుకు చెత్తబుట్టలు ఏర్పాటు చేసుకోవాలని నోటీసులు అంటిచ్చినట్టు కార్యదర్శి శేఖర్ బాబు తెలిపారు.

Tags:    

Similar News