Viral Video: బ్రహ్మోత్సవాల్లో పూజారి బ్రేక్ డ్యాన్స్...వైరల్ వీడియో

Update: 2025-02-25 01:35 GMT

Viral Video: భగవంతుని ఆధ్యాత్మిక కార్యక్రమం, బ్రహ్మోత్సవాల్లో రథయాత్ర వంటి భక్తి కార్యక్రమాలు అత్యంత భక్తి, శ్రద్ధలు విశ్వాసంతో నిర్వహిస్తుంటారు. కానీ ఏపీలోని శ్రీకాకుళం జిల్లా మందస గ్రామంలోని చారిత్రక శ్రీవాసుదేవ పెరుమాళ్ 16వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి రోజు రథయాత్ర నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో భక్తి, భజనలకు బదులుగా మాస్ పాటలు పెట్టారు. వాటికి పూజారులు, అర్చకులు బ్రేక్ డ్రాన్సులు చేయడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఆలయంలో ఉండే పూజారులే ఈవిధంగా భగవంతుడి పట్ల, భక్తి కార్యక్రమాల పట్ల ప్రవర్తిస్తే ఎలా అంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఒక భగవంతుడి ఊరేగింపులా లేదు ఏదో సినిమా షూటింగ్ కోసం పూజారి డ్యాన్స్ చేస్తున్నట్లుగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు.

ఇప్పటి వరకు ఎక్కడా ఇలాంటి ఘటన కానీ, వీడియో కానీ మీరు చూసి ఉండరు. వాసుదేవుని బ్రహ్మోత్సవాల్లో పూజారులు బ్రేక్ డ్యాన్సులు చేయడం ఇదే మొదటిసారి. నిత్యం దేవుడిని కొలిచి, వేదపఠనాలు చదివే అర్చకులు వాసుదేవుని బ్రహ్మోత్సవాల్లో చివరి రోజు రథయాత్ర జరుగుతున్న సమయంలో బ్రేక్ డ్యాన్సులు చేసి విమర్శల పాలయ్యారు. ఈ ఘటన ఏపీలోని మందన గ్రామంలో చోటుచేసుకుంది.


Full View


Tags:    

Similar News