Vasupalli Ganesh: బుక్ మై ఎమ్మెల్యే’ అంటూ వాసుపల్లి గణేష్‌పై పోస్టర్స్
Vasupalli Ganesh: పోస్టులు అమ్ముకుంటున్నారంటూ నియోజకవర్గం వ్యాప్తంగా పోస్టర్లు
Vasupalli Ganesh: బుక్ మై ఎమ్మెల్యే’ అంటూ వాసుపల్లి గణేష్‌పై పోస్టర్స్
Vasupalli Ganesh: విశాఖలో పోస్టర్ల కలకలం రేగింది. సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కు వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. పోస్టులు అమ్ముకుంటున్నారంటూ నియోజకవర్గం వ్యాప్తంగా పోస్టర్లు దర్శనమిస్తున్నాయి. టిడ్కో ఇళ్లు, దేవాలయాల ఛైర్మన్ పోస్టులు, పార్టీ పదవులు అమ్మబడును.. బుక్ మై ఎమ్మెల్యే అంటూ అర్థం వచ్చేటట్లు పోస్టర్లు వెలిశాయి. డీలర్స్ అవెలెబుల్.. 40 శాతం కమిషన్ అంటూ పోస్టర్లలో ఉంది. ఈ పోస్టర్ల ఘటనపై ఇంకా స్పందించలేదు ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్. గతంలో కూడా ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. టీడీపీలో గెలిచి వైసీపీలో చేరారు వాసుపల్లి గణేష్. అయితే.. గత కొంతకాలంగా వాసుపల్లి గణేష్‌తో వైసీపీలోని మరో వర్గం విభేదిస్తోంది. దీంతో ఈ పోస్టర్ల పని.. ఆ వర్గం నేతలదేనన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.