Posani Krishnamarali
Posani Krishnamarali: వైసీపీ నేత, సినీనటుడు పోసాని కృష్ణ మురళికి 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. ఈ మేరకు రైల్వే కోడూరు మెజిస్ట్రేట్ నిర్ణయం తీసుకుంది. కోర్టులో రాత్రి 9.30గంటల నుంచి ఉదయం 5గంటల వరకు ఇరుపక్షాల వాదనలు నడిచాయి. అనంతరం కోర్టు ఆయనకు 14రోజుల రిమాండ్ విధిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది.
కులాలు, సినీ అభిమానులు, రాజకీయ పార్టీల మధ్య విద్వేషాలు, వైషమ్యాలు రెచ్చగొట్టేలా వ్యవహరించారంటూ అన్నమయ్య జిల్లా ఓబులావారిపల్లి పోలీస్ స్టేషన్ లో పోసానిపై ఈనెల 24న కేసు నమోదు అయ్యింది. దీంతో పోలీసులు బుధవారం రాత్రి పోసానిని అరెస్టు చేశారు.