Posani Krishna Murali: జైలు నుంచి పోసాని కృష్ణ మురళి విడుదల
Posani Krishna Murali: గుంటూరు జిల్లా జైలు నుంచి సినీ నటులు పోసాని కృష్ణ మురళి శనివారం విడుదలయ్యారు.
Posani Krishna Murali: గుంటూరు జిల్లా జైలు నుంచి సినీ నటులు పోసాని కృష్ణ మురళి శనివారం విడుదలయ్యారు. చంద్రబాబు,పవన్ కళ్యాణ్, లోకేశ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో అరెస్టైన సినీ నటులు పోసాని కష్ణ మురళిని పోలీసులు ఫిబ్రవరి 26న అరెస్ట్ చేశారు. రాష్ట్రంలోని పలు పోలీస్ స్టేషన్లలో ఆయనపై కేసులు నమోదయ్యాయి.
పోసాని కృష్ణమురళికి శుక్రవారం బెయిల్ లభించింది. అయితే కోర్టు సూచించిన షూరిటీలు శనివారం నాడు జైలు అధికారులకు సమర్పించారు. దీంతో గుంటూరు జైలు నుంచి పోసాని కృష్ణ మురళి జిల్లా జైలు నుంచి విడుదలయ్యారు. కర్నూల్, అన్నమయ్య, నర్సరావుపేట తదితర జిల్లాల్లో పోసాని కృష్ణమురళిపై కేసులు నమోదయ్యాయి.
చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని 2024 నవంబర్ 14న ఆయనపై కేసు నమోదైంది. జనసేన నాయకులు రేణువర్మ ఫిర్యాదుతో పోసానిపై 353 (1), 353(2),353(సి) సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో అన్నమయ్య జిల్లాలో నమోదైన కేసులో ఆయనను ఫిబ్రవరి 26న పోలీసులు అరెస్ట్ చేశారు.