వల్లభనేని వంశీ యూటర్న్ తీసుకున్నట్టేనా..? సైలెంట్‌గా వ్యూహం మార్చుకుంటున్నారా?

*దూరమైన పార్టీకి మళ్లీ దగ్గరవ్వాల్సిన అవసరం లేదన్న టాక్‌

Update: 2022-05-31 10:21 GMT

Vallabhaneni Vamsi: వంశీ తాజా కామెంట్స్‌పై వైసీపీ, టీడీపీలో దుమారం

Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీ మనసు మార్చుకున్నారా? వైసీపీలోకి వచ్చి తప్పు చేశానని ఫీలవుతున్నారా? ఆ మాటను బయట పెట్టలేక, ఎవరితో షేర్‌ చేసుకోలేక సతమతమవుతున్నారా? మహానాడు తర్వాత టీడీపీ గురించి ఆయన మాట్లాడిన మాటల వెనుక ఆంతర్యం ఏంటి? మళ్లీ సైకిల్‌ ఎక్కి గన్నవరాన్ని చుట్టేయాలని అనుకుంటున్నారా? తాను టీడీపీని ఏమనలేదు.. లోకేష్‌ విధానాలే నచ్చలేదన్న వంశీ... తెలుగుదేశంలో చేరి అదే లోకేష్‌ కలసి పనిచేయగలరా? ఇంతకీ వల్లభనేని వ్యాఖ్యలపై వైసీపీలో జరుగుతున్న చర్చ ఏంటి? వంశీ కామెంట్స్‌ను టీడీపీ క్యాంప్‌ ఎలా చూస్తోంది.? లెట్స్‌ వాచ్‌.

ఇదీ వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీ గురించి చెప్పిన మాట. ఈ ఒకే ఒక్క మాటతో గన్నవరంలో పొలిటికల్‌ హీట్‌ ఒక్కసారిగా పెరిగింది. నిన్నా మొన్నటి దాకా చంద్రబాబు, లోకేష్‌ తెలుగుదేశానికి పట్టిన తెగులు అంటూ ఉతికి ఆరేసిన వంశీ అనూహ్యంగా మాట మార్చారన్న ప్రచారం ఊపందుకుంది. గన్నవరం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా ఎన్నికైన వెంటనే ఆ పార్టీకి హ్యాండిచ్చి వైసీపీ కాంపౌండ్‌లోకి అడుగు పెట్టిన వంశీ... ఇప్పుడు టీడీపీని వెనకేసుకొస్తున్నారన్న టాక్‌ వినిపిస్తోంది. ఇంతకీ తెలుగుదేశం పార్టీ విషయంలో వంశీ ఎందుకు రూట్‌ మార్చారు? అనూహ్యంగా టీడీపీపై ఆయనకు ఎందుకు అంత ప్రేమ పుట్టుకొచ్చింది? టీడీపీ నుంచి గెలిచి ఎమ్మెల్యే అయిన తాను అలా మాట్లాడకుండా ఉండాల్సింది అయిన ప్రశ్చాత్తాపపడుతున్నారా? లేక వైసీపీకి బాయ్‌బాయ్ చెప్పే ఆలోచనలో ఉన్నారా? ఈ అంశాల చుట్టే ఏపీ పొలిటికల్‌ సర్కిల్స్‌లో హాట్‌హాట్‌గా చర్చ జరుగుతోంది.

2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే టీడీపీకి బాయ్ బాయ్ చెప్పి వైసీపీకి మద్దతుగా నిలిచిన మొదటి ఎమ్మెల్యేగా గుర్తింపు పొందారు వంశీ. పనిలో పనిగా ఏ పార్టీ నుంచి ఎన్నికయ్యారో అదే పార్టీని వీలు దొరికినప్పుడల్లా తూర్పారపట్టారు. వైసీపీకి మద్దతుగా నిలిచిన నాటి నుంచి చంద్రబాబు,లోకేష్‌లపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఒకదశలో చంద్రబాబు కంట నీరు ఒలకడానికి కూడా వంశీయే కారణమన్న టాక్‌ వినిపించింది అప్పట్లో.! అలాంటి వంశీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ విషయంలో చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు కారణమయ్యాయి. ఇటీవల గన్నవరం నియోజకవర్గంలో పర్యటిస్తున్న వంశీ తెలుగుదేశం పార్టీపై పొగడ్తలు గుప్పిస్తూ చేసిన వ్యాఖ్యలు అటు వైసీపీ, ఇటు టీడీపీలో దుమారం రేపుతున్నాయట.

మహానాడును గ్రాండ్‌ సక్సెస్‌ చేశామని తెలుగు తమ్ములు ఊరూవాడా చెప్పుకుంటూ ఆనందం వ్యక్తం చేస్తున్న వేళ... పార్టీ గురించి వల్లభనేని వంశీ చేసిన కామెంట్స్‌ కాక పుట్టిస్తున్నాయట. అసలు ఇంతకీ వంశీ ఎందుకు ఈ వ్యాఖ్యలు చేశారన్నదానిపై రకరకాల చర్చలు నడుస్తున్నాయి. వైఎస్‌ జగన్‌ సర్కార్‌ ఈ మధ్య గడపగడపకు మన ప్రభుత్వం అంటూ ఊరూరూ తిరుగుతోంది. ఆ టూర్‌లో భాగంగానే గన్నవర ఎమ్మెల్యేగా పర్యటన చేస్తున్న వంశీ అనూహ్యంగా టీడీపీని పొగుడుతూ, ఇంతకు ముందు తానేమీ అలా మాట్లాడలేదంటూ కవర్‌ చేసుకోవడం అంతుచిక్కడం లేదట. మహానాడులాంట ఓ సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేయడం వెనుక ఉన్న అసలు ఉద్దేశాలు ఏంటన్న దానిపై ఎవరికి వారు లెక్కలు వేసుకుంటున్నారట. తెలుగుదేశం పార్టీని సమయం దొరికినప్పుడల్లా విమర్శించే వంశీ అనూహ్యంగా యూటర్న్ ఎందుకు తీసుకున్నారనే దానిపై గన్నవరం నియోజకవర్గంలో పెద్ద చర్చ జరుగుతోందట.

అసెంబ్లీ లోపలైనా, బయటైనా తెలుగుదేశం పార్టీని, దాని అధినేతను, యువనేతను గ్యాప్‌ దొరికితే చెడుగుడు ఆడుకునే వంశీ.. సైలెంట్‌గా వ్యూహం మార్చుకోవడం ఆసక్తికరంగా మారింది. అయితే, వంశీ వ్యాఖ్యలు రాజకీయంగా చర్చకు వచ్చేవి కావంటున్నారు ఆయన అనుచరులు. ఆయన టీడీపీని వీడినప్పుడు తెలుగుదేశం పార్టీలో నెలకొన్నటువంటి విభేదాలే కారణమంటున్నారు. అందుకే బయటకు వచ్చి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారే కానీ, తెలుగుదేశం పార్టీని పల్లెత్తు మాట అనలేదని కవర్‌ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్‌ ప్రారంభించిన కొత్తల్లో ఆయన పార్టీని ఎలా నడిపారో... దానికి భిన్నంగా చంద్రబాబు, లోకేష్‌ ప్రవర్తిస్తున్నారని మాత్రమే అన్నారని అంటున్నారు. ఇదే అంశాన్ని మహానాడు తర్వాత వల్లభనేని ప్రస్తావించారే తప్ప... అది టీడీపీని వెనుకేసుకురావడం కాదని చర్చకు పుల్‌స్టాఫ్‌ పెడుతున్నారు.

ఇందాక చెప్పుకున్నట్టు పార్టీలోని వ్యవస్థ విధానాలకంటే, అందులోని వ్యక్తుల విధానాల వల్లే వంశీ టీడీపీని వీడారన్నది ఆయన అనుచరుల మాట. పైగా చంద్రబాబు, లోకేష్‌ విషయంలో వారితో ఏకీభవించడం ఇష్టం లేకే టీడీపీకి దూరమైన తమ నేత మళ్లీ ఇప్పుడు అదే పార్టీకి దగ్గరవ్వాల్సిన అవసరం లేదని కొట్టిపడేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో వంశీ వైసీపీ తరఫునే గన్నవరంలో పోటీ చేస్తారని, ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీ వైపు వెళ్లే అవకాశం లేదని అంటున్నారు. మరి వంశీ ఆలోచన ఏంటో... ఏమాలోచించి ఆయన ఈ మాటలు అన్నారో.. రాబోయే ఎన్నికలకు ముందు ఆయన ఏ నిర్ణయం తీసుకోబోతున్నారో, గన్నవరం హీట్‌ను మరింత పెంచుతారో, తగ్గిస్తారో చూడాలి.

Full View


Tags:    

Similar News