Corona Effect: ఏపీలో వివాహ రిసెప్షన్‌ అడ్డుకున్న పోలీసులు

కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ కోసం ఏపీ ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది.

Update: 2020-03-25 03:15 GMT
wedding reception In Kurnool

కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ కోసం ఏపీ ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది.ప్రజలెవ్వరూ బయటికి రాకుండా రాష్ట్రంలో లాక్ డౌన్ విధించారు. ఈ క్రమంలో ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు కొందరు రోడ్లమీద ఎడాపెడా తిరుగుతున్నారు. అలాంటి వారికి పోలీసులు తగిన బుద్ధి చెబుతున్నారు. ఇక రాష్ట్రంలో ఏ విధంగానూ ప్రజలు గుమిగూడకూడదని ఆదేశించిన ప్రభుత్వం.. కొన్ని ఫంక్షన్లను కూడా వాయిదా వేసుకోవాలని సూచిస్తోంది. అయితే కొంతమంది ఈ ఆదేశాలను పాటించకుండా తమకేమి పట్టదన్నట్టు పెళ్లిళ్లు, ఫంక్షన్లు చేస్తున్నారు. దాంతో నిర్వాహకుల పై పోలీసులు ఫైర్ అవుతున్నారు.

మంగళవారం కర్నూలు పత్తికొండలో వివాహ రిసెప్షన్‌ ఏర్పాటు చేయడంతో వందలాది మంది బంధువులు ఒకేచోట చేరారు. దాంతో సమాచారం అందుకున్న ఎస్‌ఐ గుర్రప్ప, స్పెషల్‌బ్రాంచ్‌ ఎస్‌ఐ నరసప్ప అక్కడికి వెళ్లి వారిని హెచ్చరించి పంపించి వేశారు. ఇందులో ప్రభుత్వ రిటైర్డ్‌ ఉద్యోగులు కూడా ఉండటం ఉన్నారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న శుభకార్యాలయాలపై ప్రభుత్వం దృష్టిసారించింది. ఎక్కడ ఇటువంటి కార్యక్రమాలు జరగకుండా కౌన్సలింగ్ ఇస్తున్నారు పోలీసులు.


Tags:    

Similar News