గోడలో ఇరుక్కున్న బాలుడు... కాపాడిన పోలీసులు

ఒక్కోసారి చిన్నారులు చేసే చిలిపి పనులు ప్రాణాల మీదకు తెస్తుంటాయి.

Update: 2020-06-07 02:21 GMT

ఒక్కోసారి చిన్నారులు చేసే చిలిపి పనులు ప్రాణాల మీదకు తెస్తుంటాయి. అక్కడే ఆడుకుంటున్నట్టు ఉంటారు... అప్పుడే మాయమై మనల్ని ఇబ్బందులు పెడతారు. తాజాగా ఏపీలోని విజయవాడలో ఒక బాలుడు ఇదే విధంగా ఆడుక్కుంటూ వెళ్లి రెండు గోడల మధ్య ఇరుక్కు పోవడంతో చివరకు పోలీసులు వచ్చి కాపాడాల్సిన అవసరం వచ్చింది.

ఆప్పటి వరకు కళ్ల ముందు ఆడుకుంటున్న బాలుడు గోడలో ఇరక్కుపోవడంతో ఆ దంపతులు తల్లడిల్లిపోయారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఆగమేఘాల మీద అక్కడికి చేరుకున్న పోలీసులు బాలుడిని క్షేమంగా రక్షించారు. ఈ ఘటన విజయవాడలో చోటుచేసుకుంది.

విజయవాడ భవానీపురం లేబర్ కాలనీకి చెందిన చాట్రగడ్డ సోమయ్య కుమారుడు ఆరేళ్ల నిరంజన్ ఆడుకుంటూ ఇంటికి-పక్కింటికి మధ్య ఉన్న గోడలో ఇరుక్కు పోయాడు. దీంతో ఊపిరి అందక బాలుడు ప్రమాదంలో చిక్కుకున్నాడు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనాస్థలానికి చేరుకున్న భవానీపురం పోలీస్ స్టేషన్ సిబ్బంది ఎసై కవిత శ్రీ , హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస రావు చలపతి సహాయక చర్యలు చేపట్టారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి.. చాకచక్యంగా గోడ సందులోంచి బాలుడుని ప్రమాదం నుండి రక్షించారు. పోలీసులు స్పందించిన తీరుపట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేసారు. 


Tags:    

Similar News