జేసీ ఫ్యామిలీకి షాక్.. ప్రభాకర్ రెడ్డిపై మరో కేసు నమోదు

అనంతపురం జిల్లా టీడీపీ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి మరో కేసు నమోదైంది.

Samba Siva Rao
Published on: 6 Jun 2020 7:09 PM IST
జేసీ ఫ్యామిలీకి షాక్.. ప్రభాకర్ రెడ్డిపై మరో కేసు నమోదు
X
JC Prabhakar reddy (File Photo)

అనంతపురం జిల్లా టీడీపీ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి మరో కేసు నమోదైంది. నమోదైంది. జేసీ‌కి చెందిన దివాకర్ ట్రావెల్స్‌ మాజీ ఉద్యోగులు నాగేశ్వరరెడ్డి, సుబ్బారెడ్డి ఫిర్యాదుతో ప్రభాకర్‌రెడ్డితో పాటు మరో నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

అంతకు ముందు జేసీ ఇంటి వద్ద లారీ ఓనర్లు ధర్నాకు దిగారు. బీఎస్-3 వాహనాలను బీఎస్ - 4 వాహనాలుగా చూపించి తమకు విక్తయించారని తమకు నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. దీంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.. వెంటనే పోలీసులు జేసీ దివాకర్ రెడ్డి ఇంటి వద్దకు చేరుకుని లారీ ఓనర్లను అక్కడి నుంచి పంపించేశారు. అలాగే ధర్నాకు దిగిన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై ప్రభాకర్ రెడ్డి కుటుంబ సభ్యులు స్పందించారు. ధర్నా వ్యవహారం వెనక అధికార పార్టీ హస్తం ఉందని ఆరోపించారు.


Samba Siva Rao

Samba Siva Rao

Next Story