జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభానును అడ్డుకున్న తెలంగాణ పోలీసులు
Udaya Bhanu Samineni: పులిచింతల ప్రాజెక్టుకు సందర్శనకు వెళ్లిన ఉదయభాను
ఎమ్మెల్యే సామినేని ఉదయ భాను (ఫైల్ ఇమేజ్)
Udaya Bhanu Samineni: పులిచింతల ప్రాజెక్టులో విద్యుదుత్పత్తి ఎలా జరుగుతుందో చూసేందుకు వెళ్తున్న జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభానును తెలంగాణ పోలీసులు అడ్డుకున్నారు. ముత్యాల, బుగ్గమాధారం దగ్గర తెలంగాణ పోలీసులు అడ్డుకున్నారు. దాంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఏపీ, తెలంగాణ బార్డర్ దగ్గర పోలీసుల భారీగా మోహరించారు. ఎమ్మెల్యే ఉదయభానుతో కోదాడ డీఎస్పీ సూచనలో వెనుతిరిగారు. అనంతరం కృష్ణా జిల్లా ముక్త్యాల నుంచి బోటులో కృష్ణానది గుండా ప్రయాణించారు. అనంతరం తెలంగాణ పులిచింతల ప్రాజెక్టు వద్దకు వెళ్లారు.