వాహనదారులకు అవగాహనా కార్యక్రమం

పట్టణంలో చిన్న గాంధీ బొమ్మ సెంటర్,పెద్ద గాంధీ బొమ్మ సెంటర్ లలో జిల్లా ఎస్పీ యం.రవీందర్ నాథ్ బాబు గారి ఆదేశాల మేరకు 31వ జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహించారు.

Update: 2020-01-20 08:59 GMT

నూజివీడు: పట్టణంలో చిన్న గాంధీ బొమ్మ సెంటర్,పెద్ద గాంధీ బొమ్మ సెంటర్ లలో జిల్లా ఎస్పీ యం.రవీందర్ నాథ్ బాబు గారి ఆదేశాల మేరకు 31వ జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహించారు. ఇందులో భాగంగా డి.ఎస్.పి బి.శ్రీనివాసులు,సర్కిల్ ఇన్స్పెక్టర్ పి.రామచంద్రరావు పర్యవేక్షణలో నేడు వాహనదారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనదారులకు హెల్మెట్ లేకుండా వాహనం నడప రాదని, ట్రిపుల్ రైడింగ్ చేయరాదని, మితిమీరిన వేగంతో వాహనం నడప రాదని, మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని సూచించారు.

అదేవిధంగా కార్లకు బ్లాక్ ఫిలిం ఉండరాదని,సీటు బెల్టు పెట్టుకోకుండా వాహనం నడప రాదని,వాహనాలను ఆపి వారితో సీట్ బెల్ట్ పెట్టించి బ్లాక్ ఫిలిం తొలగించవలసిందిగా సూచనలు చేసి పంపించినట్లు ట్రాఫిక్ ఎస్.ఐ సాగర్ బాబు తెలిపారు. రోడ్డు భద్రతా వారోత్సవాలు అనంతరం నిబంధనలు అతిక్రమించిన వాహనదారులకు,యజమానులకు భారీగా జరిమానాలు విధించడం జరుగుతుందని, అలానే కార్లను సీజ్ చేయడం జరుగుతుందని ట్రాఫిక్ ఎస్ఐ అన్నారు. 

Tags:    

Similar News