మహిళ రక్షణపై అవగాహన సదస్సు
పట్టణంలో జిల్లా ఎస్పీ ఎం రవీంద్రనాథ్ బాబు ఆదేశాల మేరకు డీఎస్పీ బి శ్రీనివాసులు సబ్ ఇన్స్పెక్టర్ పి రామచంద్రరావు ఆధ్వర్యంలో మహిళలకు కల్పించవలసిన రక్షణ గూర్చి క్షుణ్ణంగా వివరించారు.
నూజివీడు: పట్టణంలో జిల్లా ఎస్పీ ఎం రవీంద్రనాథ్ బాబు ఆదేశాల మేరకు డీఎస్పీ బి శ్రీనివాసులు సబ్ ఇన్స్పెక్టర్ పి రామచంద్రరావు పట్టణ ఎస్ఐ శ్రీనివాస రావు ఆధ్వర్యంలో మహిళా మిత్రులు ఏర్పాటు చేసి వాటి విధి విధానాలు వారు చేయవలసిన కార్యక్రమాలు తోటి మహిళలకు కల్పించవలసిన రక్షణ గూర్చి క్షుణ్ణంగా వివరించారు.
నూజివీడు పట్టణంలో మొత్తం 30 వార్డులలో మహిళా మిత్రులు ఏర్పాటు చేసి ఎవరికి ఏ ఆపద వచ్చినా పోలీసులకు సమాచారం ఇవ్వాలని వారికి మహిళా మిత్ర సభ్యులు కూడా అండగా ఉండాలని సూచించారు. నూజివీడు మునిసిపాలిటీ కార్యాలయంలోని కమ్యూనిటీ హాల్ లో నేడు ఈ సమావేశం పోలీసులు అధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలీసులు ఎన్నుకోబడిన 30 వార్డు లలోని మహిళా మంత్రులు పాల్గొన్నారు.