దేవినేని ఉమా అరెస్ట్

అడుగడుగునా పోలీసులు ఆంక్షలు పెట్టినా కూడా టీడీపీ వాటిని బేఖాతరు చేస్తూ ముట్టడి కార్యక్రమం నిర్వహిస్తోంది.

Update: 2020-01-20 09:21 GMT

గొల్లపూడి: అడుగడుగునా పోలీసులు ఆంక్షలు పెట్టినా కూడా టీడీపీ వాటిని బేఖాతరు చేస్తూ ముట్టడి కార్యక్రమం నిర్వహిస్తోంది. అసెంబ్లీ ముట్టడి పిలుపుతో పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు .దేవినేని ఉమా కోసం పోలీసుల కఛలో అసెంబ్లీ ముట్టడి భగ్నానికి పోలీసులు యత్నిస్తున్నారు.అమరావతి పరిరక్షణ సమితి, జేఏసీ, పలు రాజకీయ పార్టీలు తలపెట్టిన 'అసెంబ్లీ ముట్టడి'ని అడ్డుకునేందుకు పోలీస్‌శాఖ పకడ్బందీ చర్యలు చేపట్టింది.

గొల్లపూడి లో అడుగడుగునా పోలీసులు ఆంక్షలు అమలు చేస్తున్నారు. సెక్షన్‌ 144, 30 పోలీస్‌ యాక్టు అమలులో ఉన్నాయని, వీటిని దృష్టిలో ఉంచుకుని అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని విరమించుకోవాలని సూచించారు. ప్రధాన ప్రతిపక్షమైన తెదేపా నేతలు ఎవరూ ఇళ్లల్లో నుంచి బయటకు రాకుండా వారికి ముందుగానే పోలీసులు నోటీసులు ఇచ్చారు.

మరికొందరు తెదేపా నేతల కదలికలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ లోగా ద్విచక్ర వాహనంపై వచ్చి జాతీయ రహదారిని దిగ్బంధించిన మాజీ మంత్రి దేవినేని ఉమను పోలీసులు అడ్డుకున్నారు.గొల్లపూడి లో గంటకు పైగా తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.ఎట్టకేలకు పెద్దఎత్తున వచ్చిన పోలీసులు బలవంతంగా దేవినేని ని అరెస్టు చేసి అనంతరం నున్న పోలీస్ స్టేషన్ కు తరలించారు.  

Tags:    

Similar News