పోలవరంపై కేంద్రం కీలక నిర్ణయం

ఏపీలోని ప్రతిష్టాత్మక ప్రాజెక్టు పోలవరంపై కేంద్రం ప్రభుత్వం కీలక నిర్ణయం ప్రకటించింది.

Update: 2020-02-10 14:45 GMT

ఏపీలోని ప్రతిష్టాత్మక ప్రాజెక్టు పోలవరంపై కేంద్రం ప్రభుత్వం కీలక నిర్ణయం ప్రకటించింది. 2021లోగా పోలవరం ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తామని వెల్లడించింది. పోలవరం ప్రాజెక్ట్ కోసం 3047 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని తెలిపింది. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నుంచి రూ.1400 కోట్లు నిధులు విడుదల చేసినట్లు తెలిపింది. పోలవరం ప్రాజెక్టుపై రాజ్యసభలో బీజేపీ ఎంపీ సుజనా చౌదరి ఆడిన ప్రశ్నకు కేంద్రం లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చింది

కాంట్రాక్టు నిర్వహణ కారణాలతో పోలవరం ప్రాజెక్టుకు గడువు పొడిగించినట్టు స్పష్టం చేసింది. పోలవరంపై రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిన నిధులకు సంబంధించి ఆడిట్ రిపోర్టును అందిస్తేనే.. మళ్లీ నిధులు విడుదల చేస్తామని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ర ప్రభుత్వం అడిట్ రిపోర్ట్ జరగకుండా నిధులు విడుదల చేసే ప్రసక్తి లేదని తేల్చిచెప్పింది. గతంలో ఆర్థికశాఖ నవంబర్ 26, 2019న నోట్ ఇచ్చినట్టు కూడా గుర్తు చేసింది.

కాగా.. జగన్ సర్కార్ 2021నాటికి ఎట్టిపరిస్థితుల్లోనూ పోలవరం ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాలనే పట్టుదలతో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రివర్స్ టెండరింగ్ చేపట్టి.. పోలవరం పనుల్ని కూడా వేగం చేసింది. అయితే గత కొన్ని రోజులుగా పోలవరం పనులు నిలిచిపోయాయని ప్రతిపక్షలు చేస్తున్న ఆరోపణలు చేస్తున్నాయి. పోలవరం పనులు నిలిచిపోయాయి అనే ప్రచారంలో నిజం లేదని, పునరాసం విషయంలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని నీటిపారుదల శాఖ మంత్రి అనిల్‌కుమార్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో కేంద్రం కూడా పోలవరంపై పెద్దల సభలో చెప్పిన వ్యాఖ్యలు చూస్తే 2021లో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు కృతనిచ్చయంతో ఉంది. 

Tags:    

Similar News