PM Modi: యోగాకు హద్దుల్లేవు.. వయసుతో పట్టింపు లేదు: ప్రధాని మోదీ

PM Narendra Modi: విశాఖలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Update: 2025-06-21 02:38 GMT

PM Modi: యోగాకు హద్దుల్లేవు.. వయసుతో పట్టింపు లేదు: ప్రధాని మోదీ

PM Narendra Modi: విశాఖలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనను ఆత్మీయంగా ఆహ్వానించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రధానికి జ్ఞాపికను బహూకరించారు.

ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ 

"అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. యోగా ప్రపంచ దేశాల మధ్య ఐక్యతకు ప్రతీకగా నిలిచింది. యోగా దినోత్సవాన్ని UNలో ప్రతిపాదించడంతో 175 దేశాలు దీనికి మద్దతు తెలిపాయి. ఇది చిన్న విషయం కాదు. యోగాను ప్రపంచవ్యాప్తంగా అమలు చేయడం గొప్ప విజయంగా నిలిచింది.

యోగా అనేది కేవలం శారీరక వ్యాయామం కాదు, ఇది మానవతను పెంపొందించే ఒక సమూహ ప్రక్రియ. గత పదేళ్లలో కోట్లాది మందికి ఇది స్ఫూర్తినిచ్చింది. గ్రామీణ ప్రాంతాల యువత కూడా ఇప్పుడు యోగాను తమ జీవనశైలిలో భాగం చేసుకుంటున్నారు. యోగాకు వయస్సుతో సంబంధం లేదు, యోగాకు ఎలాంటి భౌగోళిక పరిమితులు కూడా లేవు," అంటూ ప్రధాని మోదీ పేర్కొన్నారు.

Tags:    

Similar News