దివ్యాంగ విద్యార్థుల మండల స్థాయి క్రీడా పోటీలు
డిసెంబర్ 3 అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా ఈ రోజు రావికమతం భవిత కేంద్రంలో దివ్యాంగ విద్యార్థులకు మండల స్థాయి క్రీడా పోటీలు నిర్వహించడం జరిగింది.
రావికమతం: డిసెంబర్ 3 అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా ఈ రోజు రావికమతం భవిత కేంద్రంలో దివ్యాంగ విద్యార్థులకు మండల స్థాయి క్రీడా పోటీలు నిర్వహించడం జరిగింది.మ్యూజికల్ చైర్, పరుగుల పందెం, స్కిప్పింగ్, షాట్ పుట్, డిస్క్ త్రో, ట్రై సైకిల్ రేసింగ్, బాల్ గేమ్ మొదలగు ఆటలను మానసిక వైకల్యం, వినికిడి లోపం, దృష్టిలోపం, శారీరక వైకల్యం గల విద్యార్థిని విద్యార్థులకు క్రీడా పోటీలను నిర్వహించడం జరిగింది.
ఈ క్రీడా పోటీల్లో రాయుడు కోమలి (స్కిప్పింగ్), కోసూరు లోకేష్ (డిస్క్ త్రో), కోన తనూజ కుమార్ (మ్యూజికల్ చైర్), దేవర మల్లేశ్వరరావు(షాట్ ఫుట్), గల్లా రాము (ట్రై సైకిల్ రేసింగ్)లో మొదటి స్థానాలను కైవసం చేసుకుని విజేతలుగా నిలిచారు. ఈ క్రీడా పోటీల్లో గెలుపొందిన దివ్యాంగ విజేతలను రేపు విశాఖపట్నం పోలీస్ బారక్స్ లో జరిగే జిల్లా స్థాయి క్రీడా పోటీలలో పాల్గొంటారని, గెలుపొందిన దివ్యాoగ విజేతలకు డిసెంబర్ 3 వ తేదీ అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం రోజున బహుమతులు ప్రధానం చేయడం జరుగుతుందని భవిత కేంద్రం ప్రత్యేక ఉపాధ్యాయులు మహాలక్ష్మి నాయుడు, జగన్నాధ నాయుడు తెలిపారు.