ప్రజావేదిక కూల్చివేత పై హైకోర్టులో పిటిషన్ దాఖలు ..

Update: 2019-06-26 01:46 GMT

ప్రజావేదిక కూల్చివేతను సవాలు చేస్తూ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలైంది. ప్రజావేదికను కూల్చకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నివాసంలో అర్ధరాత్రి వాదనలు జరిగాయి. పిటిషనర్ శ్రీనివాస్ తరపున అడ్వకేట్ కృష్ణయ్య వాదనలు వినిపించగా, ప్రభుత్వం వెర్షన్ ను అడ్వకేట్ జనరల్ సుబ్రమణ్య శ్రీరామ్ ... హైకోర్టు సీజే దృష్టికి తీసుకెళ్లారు.అయితే, ప్రజావేదిక కూల్చివేత నిలుపుదలకు హైకోర్టు నిరాకరించింది. అడ్వకేట్ జనరల్ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు... ప్రజావేదిక కూల్చివేతను ఆపలేమని తేల్చిచెప్పింది. కేసు తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

ఇదిలా ఉంటే, ప్రజావేదిక కూల్చివేతపై సుప్రీంకోర్టుకు వెళ్తామని పిటిషనర్ తరపు న్యాయవాది కృష్ణయ్య అన్నారు. ప్రైవేట్ కట్టడాల కూల్చివేతకే నోటీసులు ఇస్తారని, ప్రభుత్వ కట్టడాలకు అవసరం లేదంటూ అడ్వకేట్ జనరల్ వాదించారని తెలిపారు. అయితే మాజీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణ నుంచి ప్రజావేదిక నిర్మాణ వ్యయాన్ని వసూలు చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాదు ప్రభుత్వ-ప్రజా ఆస్తుల విషయం ఏ నిర్ణయమైనా తొందరపాటు తగదని వాఖ్యానించారు .. 

Tags:    

Similar News