Andhra Pradesh: బుక్ మై షో, జస్ట్ బుకింగ్, పేటీఎం యాజమాన్యాలతో పేర్ని నాని సమావేశం

*ఇబ్బంది కరంగా ప్రైవేట్ టికెటింగ్ కంపెనీల వ్యవస్థ *ప్రభుత్వ ఆన్ లైన్ టికెటింగ్ కు అవరోధంగా ప్రైవేట్ టికెటింగ్ యాప్ కంపెనీలు

Update: 2021-11-26 10:24 GMT

బుక్ మై షో, జస్ట్ బుకింగ్, పేటీఎం యాజమాన్యాలతో పేర్ని నాని సమావేశం(ఫైల్ ఫోటో)

Andhra Pradesh: ఏపీలో సినిమా టిక్కెట్ ధరలను నియంత్రించడానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల అమలు కార్యాచరణలో ఇబ్బందులుంటాయా అంటే అవుననే అనిపిస్తోంది. ఇప్పటికే ప్రైవేట్ టికెటింగ్ యాప్ కంపెనీలు టిక్కెట్లు అమ్ముతుండటం, వారు నేరుగా సినిమా హాళ్ల యాజమాన్యాలతో ఒప్పందం చేసుకోవడంతో వారిని నియంత్రించే విధానాలపై చర్చ జరగాల్సి ఉంది.

బుక్ మైషో, జస్ట్ బుకింగ్, పేటీఎం యాజమాన్యాలు ఇప్పటికే ఆన్ లైన్ లో టిక్కెట్లు అముతున్నాయి. ఇప్పుడు ప్రభుత్వం ఇందులో అధికారికంగా అడుగు పెడుతుండటంతో వారిని ఎలా నియంత్రించాలి, విధాన రూపకల్పన అంశాలు చర్చకు వస్తున్నాయి. ఇదే అంశంపై సమాచార మంత్రి పేర్నినాని బుక్ మైషో, జస్ట్ బుకింగ్, పేటీఎం తదితర యాజమాన్యాలతో చర్చలు జరుపుతున్నారు.

Tags:    

Similar News