Perni Nani: అది వారాహి కాదు, నారాహి.. పవన్ ఒక్క చెప్పు చూపిస్తే.. మేం రెండు చెప్పులు చూపిస్తాం
Perni Nani: రోజుకో మాట మాట్లాడుతారు.. అదే ఓ వ్యూహం అంటాడు
Perni Nani: అది వారాహి కాదు, నారాహి.. పవన్ ఒక్క చెప్పు చూపిస్తే.. మేం రెండు చెప్పులు చూపిస్తాం
Perni Nani: అది వారాహి కాదని, నారాహి అని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. వారాహి యాత్రలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కౌంటర్‌కు పేర్నినాని రీకౌంటర్ ఇచ్చారు. చంద్రబాబును అధికారంలోకి తెచ్చేందుకు పవన్ కల్యాణ్ పని చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. రోజుకొక డైలాగ్ చెప్పి అది వ్యూహం అంటాడని, పవన్ ఒక్కడికే చెప్పులు ఉన్నాయా? తమకు రెండు చెప్పులు ఉన్నాయని నాని చూపించాడు.
పవన్ ఒక చెప్పు చూపిస్తే తాను రెండు చెప్పులు చూపిస్తానన్నారు. జనసేనను చంద్రబాబు నడిపిస్తున్నారని, ఆంధ్రాలో చిన్న పిల్లాడిని అడిగినా చెబుతారని చురకలంటించారు. పదేళ్ల నుంచి పవన్ పార్టీని చంద్రబాబు నడుపుతున్నారని పేర్నినాని ఎద్దేవా చేశారు. ప్రజలను నమ్ముకుంటే అసెంబ్లీలో సీటు వస్తుందని, చంద్రబాబు వ్యూహాలను నమ్ముకుంటే అసెంబ్లీలో అడుగుపెట్టలేవన్నారు. చంద్రబాబు కోసం ఇంత దిగజారడం అవసరమా? అని నాని అడిగారు.