Perni Nani: జమిలి ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తాము సిద్ధం..
Perni Nani: చంద్రబాబు ప్రజల్లో విశ్వాసం కోల్పోయారు
Perni Nani: జమిలి ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తాము సిద్ధం..
Perni Nani: జమిలి ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తాము సిద్ధంగా ఉన్నామని హెచ్ఎంటీవీతో మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. అయితే, షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు వెళ్ళాలనేది తమ ఉద్దేశ్యమన్నారు. ఇచ్చిన హామీలు కాదు ఇవ్వని హామీలు కూడా అమలు చేసిన వ్యక్తి జగన్ అని అయన అన్నారు. చంద్రబాబులా హామీలు ఇచ్చి మోసం చేసి ఎన్నికలకు వెళ్లడం లేదన్నారు. చంద్రబాబు ప్రజల్లో విశ్వాసం కొలిపోయారన్నారు.ప్రజల్లో వైసీపీ పై పూర్తి నమ్మకం ఉందన్నారు. మోదీ అనేక నిర్ణయాలు తీసుకుంటారని, ఆయన తీసుకున్న నిర్ణయాల వల్ల రాష్ట్రానికి,దేశానికి మేలు జరుగుతుందంటే వైసీపీ మద్దతు తెలుపుతుందన్నారు.