రాత్రి వేళల్లో గస్తీ నిర్వహించడానికి ప్రజలు సహకరించాలి: ఎస్సై శ్రీనివాస్

సబ్ డివిజన్ లోని మైలవరం నియోజకవర్గంలోని రెడ్డిగూడెం మండలంలో జిల్లా ఎస్పీ ఎం రవీంద్రనాథ్ బాబు ఆదేశాల మేరకు నూజివీడు డీఎస్పీ బి.శ్రీనివాసులు, గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు.

Update: 2019-12-17 07:45 GMT
ఎస్సై శ్రీనివాస్

నూజివీడు: సబ్ డివిజన్ లోని మైలవరం నియోజకవర్గంలోని రెడ్డిగూడెం మండలంలో జిల్లా ఎస్పీ ఎం రవీంద్రనాథ్ బాబు ఆదేశాల మేరకు నూజివీడు డీఎస్పీ బి. శ్రీనివాసులు, సబ్ ఇన్స్పెక్టర్ పలివెల.శ్రీను పర్యవేక్షణలో గ్రామ గ్రామాన ప్రజలకు అవగాహన కల్పించారు. గ్రామాల్లో బెల్ట్ షాపులు, కాపుసారా నివారించే దానికోసం ప్రజలు పోలీసులకు సహకరించాలని పిలుపునిచ్చిన ఎస్సై శ్రీనివాస్ మండలంలోని కుదప గ్రామం, తండాల్లో రాత్రి వేళ రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు.

రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మద్యపానం నిషేధించడం లో భాగంగా బెల్ట్ షాపులను నివారించింది.తండాల్లో వాటికి తూట్లు పొడుస్తూ బెల్టుషా పులు,కాపు సారా విక్రయాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన ఎస్సై.ప్రశాంతంగా వున్న గామాలలో కొందరు వ్యక్తులు మళ్లీ సారా వైపు ప్రజలను దారి మళ్లించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని,ఈ విషయం మా దృష్టికి వచ్చిందని,ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన ఎస్సై శ్రీనివాస్.సారా,మద్యం,పేకాట, కోడిపందాల వంటి జూధాలతో చిన్న సన్నకారు కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయి.

మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలకు గురవుతున్నారు. తండాలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా ప్రజలే చూసుకోవాలని,మీతో మహిళ మిత్ర కూడా తోడుగా ఉంటుందని మీకు ఎలాంటి సమాచారం తెలిసినా వారికి, పోలీసులకు తెలియజేయవచ్చు అన్నారు.ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, గ్రామ వాలంటీర్లు పాల్గొన్నారు.

Tags:    

Similar News