Payakaraopeta: రేషన్ డిపొల వద్ద సామాజిక దూరం ఏది?

కరోనా కట్టడికై ప్రభుత్వం ఎన్ని నిబంధనలు పెట్టినా ప్రజలు ఆచరించడంలేదు.

Update: 2020-03-30 05:59 GMT

పాయకరావుపేట: కరోనా కట్టడికై ప్రభుత్వం ఎన్ని నిబంధనలు పెట్టినా ప్రజలు ఆచరించడంలేదు. ఎన్ని ఆంక్షలు విధించినా భయపడడం లేదు. ఇళ్ళకే పరిమితమవ్వాలని, తప్పనిసరి పరిస్ఠితులలో బయటకు వచ్చినప్పుడు మనిషికీ మనిషికీ మద్య మీటరు సామాజికి దూరం పాటించాలని, ఎంత ప్రచారం చేసినా ఆచరించడంలేదు. పట్టణంలోని ప్రభుత్వ రేషన్ దుకాణాల వద్ద రేషన్ కై వచ్చిన వారు సోమవారం ఉదయం గుంపులుగా, దగ్గరగా సామాజిక దూరం పాటించకుండానిలుచున్నారు.

అయితే రేషన్ డిపోల వద్ద మార్కింగ్ చేసి, సామాజిక దూరం పాటించేందుకు వాలంటీర్లు చర్యలు తీసుకోవాల్సి ఉంది. అదే విధంగా రేషన్ డిపోలకు వచ్చేవారు తప్పని సరిగా చేతులు కడుక్కోవడానికి అక్కడ నీరు, సబ్బు, శానిటైజర్ లు ఉంచాల్సి ఉంది. ఇవన్నీ అమలయ్యేందుకు డిపో డీలర్, వాలంటీర్లు చర్యలు తీసుకోవాలి. అదే విధంగా వాలంటీర్లు అవగాహన కల్పించాలి. అసలు వాలంటీర్లు బాద్యతను విస్మరిస్తున్నారా, లేక ఇక్కడికి వచ్చే వినియోగదారులు నిర్లక్ష్యంగా వ్యవహిస్తున్నారో అర్ధం కావడం లేదు.


Tags:    

Similar News