మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు

సీఎం జగన్‌ చేసిన మూడు రాజధానుల ప్రకటనపై అమరావతి పరిధిలోని 29 గ్రామాల ప్రజల్లో ఆగ్రహావేశాలు మిన్నంటాయి.

Update: 2019-12-20 05:47 GMT
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

సీఎం జగన్‌ చేసిన మూడు రాజధానుల ప్రకటనపై అమరావతి పరిధిలోని 29 గ్రామాల ప్రజల్లో ఆగ్రహావేశాలు మిన్నంటాయి. రాజకీయాలకు అతీతంగా రైతులు... ప్రభుత్వంపై పోరాటానికి నడుంకట్టారు. సీఎం ప్రకటన వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఆందోళనలు మరింత ఉద్ధృతం చేయాలని నిర్ణయించారు. వెలగపూడిలో ఇవాళ రిలేదీక్షలు కొనసాగనున్నాయి. మందడంలో అన్ని గ్రామాల ప్రజలతో మహాధర్నా, తుళ్లూరులో ప్రధాన రహదారిపై వంటావార్పు కార్యక్రమానికి సిద్ధమయ్యారు.

అయితే సీఎం జగన్‌ ప్రకటనను కొందరు వ్యతిరేకిస్తుండగా... మరికొందరు స్వాగతిస్తున్నారు. రాజధాని రైతులు సైతం వ్యతిరేకిస్తూ ఆందోళన బాట పట్టారు. ఈ క్రమంలో రాజధాని గ్రామాల రైతులను జనసేన నేతలు కలవనున్నారు. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సూచన మేరకు నాదెండ్ల మనోహర్, నాగబాబుతోపాటు కమిటీ సభ్యులు, అధికార ప్రతినిధులు ఈ పర్యటనలో పాల్గొననున్నారు. ఇవాళ ఉదయం 10గంటలకు మంగళగిరిలో జనసేన కార్యాలయం నుంచి బయలుదేరి మందడం చేరుకొని అక్కడి రైతాంగం.. రైతు కూలీలతో మాట్లాడనున్నారు. అనంతరం వెలగపూడిలో రైతుల నిరాహార దీక్ష శిబిరానికి వెళ్తారు. మధ్యాహ్నం ఒంటి గంటకు తుళ్ళూరులో వంటా వార్పు కార్యక్రమానికి హాజరవుతారు.

రాజధానిపై ఇవాళ నిపుణుల కమిటీ నివేదిక ఇవ్వనుంది. అయితే ఇప్పటికే కమిటీ ప్రభుత్వానికి మధ్యంతర నివేదిక ఇచ్చింది. మరోసారి పూర్తిస్థాయి సమాచారంతో నివేదిక ఇవ్వనుంది. అయితే రాజధాని తరలింపుపై కమిటీ ఎలాంటి నివేదిక ఇస్తుంది..?. అన్ని ప్రాంతాల అభివృద్దికి ఎలాంటి సూచనలు చేయనుంది..? అనే దానిపై నిపుణుల కమిటీ నివేదికపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 


Tags:    

Similar News