పుంగనూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి తీరుతా: మంత్రి పెద్దిరెడ్డి

నియోజకవర్గంలోని ప్రజలందరికి తాగునీరు, రైతాంగానికి సాగునీరు అందించడమే ప్రధాన ఆశయమని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు.

Update: 2020-01-15 10:08 GMT

పుంగనూరు: నియోజకవర్గంలోని ప్రజలందరికి తాగునీరు, రైతాంగానికి సాగునీరు అందించడమే ప్రధాన ఆశయమని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. ఈ సందర్భంగా పలువురు తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు మంత్రి సమక్షంలో పార్టీలో చేరారు. మంత్రి వారందరికీ పార్టీ కండువాలు వేసి, పార్టీలోకి చేర్చుకున్నారు.

ఈ సందర్భంగా మంత్రి ప్రసంగిస్తూ, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల మ్యానిపెస్టోలోని నవరత్నాలను అన్ని అమలు చేయడం జరుగుతుందన్నారు. మిగిలిన ఒకే ఒక పథకం ఉగాది పండుగ రోజున ప్రారంభిస్తామన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని 25 లక్షల మందికి గృహాలు నిర్మించే కార్యక్రమం అమలు చేస్తామన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నారని కొనియాడారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సీఎం జగన్‌ జరిపిన చర్చలు త్వరలోనే ఫలితాన్నిస్తుందన్నారు. కేసీఆర్‌ సూచించిన మేరకు రాయలసీమ ప్రాంతంలో అవసరమైన ప్రాంతాలలో రిజర్వాయర్లు నిర్మించి, సాగునీరు, తాగునీరు అందజేస్తామన్నారు. ఎన్నికల సమయంలో మాయమాటలకు, ప్రలోభాలకు లోనుకావద్దని మంత్రి సూచించారు. అధికారంలోకి వస్తునే పుంగనూరును అన్ని విధాల అభివృద్ధి చేస్తామని, ఇచ్చిన మాట మేరకు నియోజకవర్గంలో ఆర్టీసి డిపో, సమ్మర్‌స్టోరేజ్‌ ట్యాంకు, మండల కార్యాలయాల పక్కా భవనాల నిర్మాణాలు, గ్రామీణ ప్రాంతంలోని అన్ని వీధుల్లోను సిమెంటు రోడ్లు వేసే కార్యక్రమం చేపట్టి, ఆదర్శంగా నిలిచామన్నారు.

తాను ఎన్నికల సమయంలో ఇచ్చిన అన్ని హామిలను పూర్తి చేసి , తిరిగి ఎన్నికలకు వస్తానని, అమలు చేయపోతే ఎన్నికల్లోకి రానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దిరెడ్డి, పోకల అశోక్ కుమార్, కొండవీటి నాగభూషణం, వెంకటరెడ్డి యాదవ్,కార్యకర్తలు పాల్గొన్నారు. 

Tags:    

Similar News