వైభవంగా ఉపమాక వెంకన్న తిరువీధి సేవ

మండలంలోని ఉపమాక గ్రామంలో ప్రసిధ్ధ పుణ్యక్షేత్రం వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.

Update: 2019-12-19 09:57 GMT

పాయకరావుపేట: మండలంలోని ఉపమాక గ్రామంలో ప్రసిధ్ధ పుణ్యక్షేత్రం వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. కొండపై గల కల్కి వేంకటేశ్వర స్వామి మూలవిరాట్ వద్ద అర్చకుడు కృష్ణమాచార్యులు ఉదయం అభిషేకం ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొండ దిగువున క్షేత్ర పాలకుడు వేణుగోపాలస్వామి, వేంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తులు, గోదాదేవి అమ్మవారి ఆలయాలలో ప్రధాన అర్చకుడు ప్రసాదాచార్యులు ఆధ్వర్యంలో నిత్య పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

అనంతరం ఉభయ దేవేరులతో స్వామివారిని రాజాధిరాజ వాహనంపైన గోదాదేవి అమ్మవారిని పల్లకీలోను వేంచేపుచేసి గ్రామ మాఢవీధులలో తిరువీధి సేవ నిర్వహించారు. తరువాత గోదాదేవి (ఆండాళ్ ) అమ్మవారి ఆలయంలో తిరుప్పావై లోని నాలుగవ ఆలిమలైకణ్ణా పాశురంతో ప్రత్యేక నీరాజన, మంత్రపుష్పాలు, తీర్థగోష్ఠి, ప్రసాద వినియోగం నిర్వహించారు.

Tags:    

Similar News