మోదీకి పవన్ కల్యాణ్ మద్దతు

కరోనాపై నియంత్రణ నేపథ్యంలో మార్చి 20న జనతా కర్ఫ్యూకి పిలుపునిచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ.

Update: 2020-04-03 13:09 GMT
Pawankalyan, PM Narendra Modi

కరోనా పై నియంత్రణ నేపథ్యంలో మార్చి 20న జనతా కర్ఫ్యూకి పిలుపునిచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ..తాజాగా మరో కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఏప్రిల్ 4న రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు లైట్లు ఆర్పివేసి దీపాలు, కొవ్వొత్తులు, మొబైల్ లైట్స్, వెలిగించాలని దేశప్రజలను కోరారు. ప్రజలంతా సామాజిక దూరం పాటిస్తూ.. ఇళ్లల్లోనే ఉండి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ప్రధాని విజ్ఞప్తి చేశారు. కరోనా మహమ్మారి చీకట్లను తరిమికొట్టాలని సూచించారు. ఈ క్రమంలో 130 కోట్ల మంది ప్రజల మహా సంకల్పాన్ని చాటుదామని మోదీ పిలుపునిచ్చారు.

ఈ మోదీ తల పెట్టిన ఈ కార్యక్రమానికి అన్ని వైపుల నుంచి మద్దతు లభిస్తోంది. తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ సైతం ట్విటర్ ద్వారా మద్దతు తెలిపారు. మోదీ ఈ కార్యక్రమానికి పిలుపునిచ్చిన వెంటనే ట్విటర్‌లో 9baje9minute (9 గంటలకు 9 నిమిషాలు) అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. ఇలా ప్రధాని మూఢనమ్మకాలను నమ్ముకోవడం ఏంటని కొందరు మండిపడుతున్నారు. మోదీ లైట్‌ప్ ఇండియా కాన్సెప్ట్‌లో క్వాంటమ్ సిద్ధాంతం, రిథంభర సిద్ధాంతం సైన్స్ దాగుందనే అభిప్రాయలూ వ్యక్తమవుతున్నాయి. 

Tags:    

Similar News