ఇవాళ ఉమ్మడి గుంటూరు జిల్లాలో జనసేనాని పర్యటన
* సత్తెనపల్లి మండలం ధూలిపాళ్లలో జనసేన కౌలురైతు భరోసా యాత్ర
ఇవాళ ఉమ్మడి గుంటూరు జిల్లాలో జనసేనాని పర్యటన
Guntur: ఇవాళ ఉమ్మడి గుంటూరు జిల్లాలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు. సత్తెనపల్లి మండలం ధూలిపాళ్లలో జనసేన కౌలురైతు భరోసా యాత్రలో ఆయన పాల్గొననున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ధూలిపాళ్లలో కౌలురైతు భరోసా సభలో ఆయన ప్రసంగించనున్నారు. అనంతరం ఆత్మహత్యకు పాల్పడిన కౌలురైతు కుటుంబాలకు లక్ష రూపాయలు చొప్పున ఆర్థికసాయం అందించనున్నారు. మరోవైపు జనసేన కౌలురైతు సభపై పోలీసులు ఆంక్షలు విధించారు. కౌలురైతు సభకు అనుమతి నిరాకరించారు. దీంతో పవన్ సభపై ఉత్కంఠ నెలకొంది.