Palnadu: సత్తెనపల్లి నుంచి ధూళిపాళ్ల సభ వరకు పవన్ రోడ్ షో
Palnadu: పవన్ కల్యాణ్‌కు ఘనస్వాగతం పలికిన జనసేన నేతలు
Palnadu: సత్తెనపల్లి నుంచి ధూళిపాళ్ల సభ వరకు పవన్ రోడ్ షో
Palnadu: పల్నాడు జిల్లా సత్తెనపల్లికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేరుకున్నారు. జనసేనానికి ఆ పార్టీ నేతలు ఘనస్వాగతం పలికారు. సత్తెనపల్లి నుంచి ధూళిపాళ్ల సభ వరకు పవన్ రోడ్ షో నిర్వహిస్తున్నారు. కాసేపట్లో ధూళిపాళ్లలో కౌలురైతు భరోసా సభలో ఆయన ప్రసంగించనున్నారు. అనంతరం ఆత్మహత్యకు పాల్పడిన కౌలురైతు కుటుంబాలకు లక్ష రూపాయలు చొప్పున ఆర్థికసాయం అందించనున్నారు పవన్. మరోవైపు జనసేన కౌలురైతు సభపై పోలీసులు ఆంక్షలు విధించారు. కౌలురైతు సభకు అనుమతి నిరాకరించారు. దీంతో పవన్ సభపై ఉత్కంఠ నెలకొంది.