విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నేతలతో పవన్ సమావేశం

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు రెండో రోజు విశాఖలో పర్యటిస్తున్నారు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నేతలతో పవన్ సమావేశం అవుతారు. ఈ సందర్బంగా పార్టీ ఓటమికి గల కారణాలపై

Update: 2019-11-05 01:48 GMT

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు రెండో రోజు విశాఖలో పర్యటిస్తున్నారు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నేతలతో పవన్ సమావేశం అవుతారు. ఈ సందర్బంగా పార్టీ ఓటమికి గల కారణాలపై సమీక్ష నిర్వహించనున్నారు. అలాగే భవిశ్యత్ ప్రణాళికపై రెండు జిల్లాల నేతలకు దిశానిర్ధేశం చేయనున్నారు. రాబోయే రోజుల్లో ఇసుక తరహా పోరాటాలకు సిద్ధంగా ఉండాలని ఆయన ఇప్పటికి ఆదేశాలిచ్చారు. ఇక రెండు జిల్లాల నియోజకవర్గాలకు ఇంచార్జిల నియామకం తోపాటు పర్యవేక్షించే నేతలను కూడా నియమించనున్నారు పవన్.

ఇప్పటికే విశాఖ జిల్లాలో కీలక నేత అయిన పసుపులేటి బాలరాజు జనసేనకు రాజీనామా చేసిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అప్రమత్తమయ్యారు. పార్టీపై అసంతృప్తితో ఉన్న నేతలను గుర్తించాలని నిర్ణయించుకున్నారు. పార్టీని వీడాలనుకుంటున్న నేతలను బుజ్జగించే బాధ్యతను సీనియర్లకు అప్పగించారాయన. కాగా ఇసుక కొరత కారణంగా ఈనెల 3న విశాఖలో పవన్ కళ్యాణ్ లాంగ్ మార్చ్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ మార్చ్ కు టీడీపీ ముఖ్యనేతలు కూడా హాజరయ్యారు.

Tags:    

Similar News