ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటన
Pawan Kalyan: లాల్‌పురంలో గజమాలతో పవన్‌కు ఘన స్వాగతం
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటన
Pawan Kalyan: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. కౌలు రైతు భరోసా యాత్ర పేరిట పలు జిల్లాల్లో పవన్ కళ్యాణ్ పర్యటించారు. కౌలు రైతుల కుటుంబాలకు ఆర్థికసాయం అందజేశారు. ప్రస్తుతం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పర్యటిస్తున్న పవన్.. కాసేపట్లో పర్చూరు కౌలు రైతు కుటుంబాలను పరామర్శించనున్నారు.
దారి పోడవునా పవన్ కళ్యాణ్‌కు జన సైనికులు, అభిమానులు ఘన స్వాగతం పలుకుతున్నారు. లాల్‌పురంలో గజమాలతో పవన్‌కు ఘన స్వాగతం పలికారు. అక్కడ కొద్దిసేపు జనసైనికులను ఉద్దేశించి పవన్ ప్రసంగించారు. కాసేపట్లో పర్చూరు SKPR డిగ్రీ కాలేజీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభలో పవన్ పాల్గొంటారు.