Pawan Kalyan: సేవ్ ఏపీ ఫ్రమ్ వైసీపీ అంటూ జనసేనాని ట్వీట్
Pawan Kalyan: ఏపీ ప్రభుత్వంపై మరోసారి ధ్వజమెత్తిన జనసేనాని
మరోసారి ధ్వజమెత్తిన పవన్ కళ్యాణ్ (ట్విట్టర్ ఇమేజ్)
Pawan Kalyan: జనసేన చీఫ్ పవన్‌కల్యాణ్ మరోసారి ఏపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ట్విట్టర్ వేదికగా వైసీపీపై విరుచుకుపడ్డారు. సేవ్ ఏపీ ఫ్రమ్ వైసీపీ అంటూ ట్వీట్ చేశారు. ఇష్టానుసారంగా ప్రజల మీద పన్నులు రుద్ది, మద్యం ఆదాయాన్ని తాకట్టుపెట్టి అప్పులు చేసి పాలిస్తే అది సుపరిపాలన అనిపించుకోదని విమర్శించారు. సంక్షేమం అసలే కాదని మండిపడ్డారు. నవరత్నాలు భావితరాలకు నవకష్టాలుగా మారాయన్నారు.