కౌలు రైతులకు పవన్ కల్యాణ్ భరోసా.. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు సాయం...

Pawan Kalyan: వెయ్యి మంది రైతులకు ఆర్థికసాయం చేయాలని జనసేనాని నిర్ణయం...

Update: 2022-04-12 02:02 GMT

కౌలు రైతులకు పవన్ కల్యాణ్ భరోసా.. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు సాయం...

Pawan Kalyan: కౌలు రైతుల భరోసా యాత్ర ను ఇవాళ అనంతపురం జిల్లా నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రారంభించనున్నారు. ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతులకు ఆర్ధిక సాయం అందించి.. వారి కుటుంబాల్లో దైర్యం నింపడానికి జనసేనాని ఈ కార్యక్రమాన్ని తలపెట్టారు. ఉదయం 9 గంటలకు ప్రత్యేక విమానంలో పుట్టపర్తికి చేరుకుంటారు పవన్ కళ్యాణ్. 9 గంటల 30 నిమిషాలకు శ్రీ సత్య సాయి జిల్లాలోని కొత్త చెరువుకు చేరుకుంటారు.

ఆ గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాన్ని పవన్ కళ్యాణ్ పరామర్శించనున్నారు. అనంతరం బాధిత కుటుంబానికి లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించనున్నారు. కొత్త చెరువు నుంచి ధర్మవరానికి చేరుకొని మరో బాధిత రైతు కుటుంబాన్ని పరామర్శించి ఆర్ధిక సాయం చేయనున్నారు పవన్ కల్యాణ్. అనంతరం కు ధర్మవరం నుంచి బయలుదేరి ధర్మవరం రూరల్ లోని గొట్లూరుకి చేరుకుంటారు. అక్కడ ఆత్మహత్య చేసుకున్న మరో రైతు కుటుంబాన్ని పరామర్శించి వారిలో ధైర్యాన్ని నింపి ఆర్ధిక సాయం అందించనున్నారు.

అనంతరం రచ్చబండ కార్యక్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. ఇక్కడ జిల్లాలో ఆత్మహత్యకు పాల్పడిన మరికొందరు కౌలు రైతుల కుటుంబాలకు ఈ సభలో ఆర్ధిక సాయం అందజేసి, వారి కుటుంబ పరిస్థితులు తెలుసుకుంటారు. అనంతరం అనంతపురం రూరల్ మండల పరిధిలోని మన్నీల గ్రామంలో జరిగే రచ్చబండ కార్యక్రమంలో జనసేనాని పాల్గొననున్నారు. గ్రామ సభ ఏర్పాటు చేసి మరింత కొంత మంది కుటుంబాలకు భరోసా ఇవ్వనున్నారు పవన్.

మొత్తం అనంతపురం జిల్లాల్లో ఆత్మహత్యలకు పాల్పడిన 28 మంది కౌలు రైతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించనున్నారు. ఆత్మహత్య చేసుకున్న కౌల్ రైతులకు గతంలో ప్రభుత్వం 7లక్షల సాయం అందిస్తామని ప్రకటించి విస్మరించింది. ప్రభుత్వం మూడేళ్ల క్రితం కౌలు రైతుల కోసం ప్రత్యేక జీవోలు తెలిసినప్పటికీ..అమలుకు నోచుకోవడం లేదని ఆ పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు.

అనంతపురం జిల్లాపై ముందు నుంచి ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్న జనసేనాని మరోసారి కరవు సీమపై తన ఇష్టాన్ని చాటుకున్నారు. అనంతపురం జిల్లా నుంచి రైతు భరోసా యాత్ర ప్రారంభించడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు వెయ్యి మందికి పైగా ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు ఆర్థిక సాయం చేయాలని జనసేన పార్టీ భావిస్తోంది.

Tags:    

Similar News