రాజకీయాల్లోకి స్వార్థం కోసం రాలేదు : పవన్ కళ్యాణ్

Update: 2020-03-14 15:16 GMT
Pawan Kalyan

నలుగురు కొడతారన్న భయం లేదని, పార్టీ స్థాపించినప్పుడు మేధావులెవరు తనతో లేరని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. కులాలతో రాజకీయాలు చేద్దామనే వారే ఉన్నారని విమర్శించారు. తాను కుల మతాలకు అతీతంగా యువతను నమ్మానని అన్నారు. జనసేన పార్టీ ఆవిర్భావం సందర్భంగా రాజమండ్రి లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆ‍యన మాట్లాడారు. ఈసందర్భంగా నాకు మంచి సినీ జీవితం ఉన్న రాజకీయాలను ఎంచుకున్నానని అన్నారు. పార్టీలో చేరిన వారు మళ్ళీ పారిపోతారని కూడా తెలుసన్నారు. సమాజం అంత పిరికి వారితో తయారు అయింది. నాకు అలాంటి వారు తనకు అవసరం లేదు అని పవన్ కళ్యాణ్ తెలిపారు.

పిడుగు మీద పడ్డ, ఫిరంగి గుండెల్లో గుచ్చుకున్నా నిలబడే ధైర్యవంతులు రాజకీయాల్లోకి రావాలని అన్నారు. అలాంటి వారు జనసేనలో చేరాలని పిలుపునిచ్చారు. కవాతు నిర్వహించినపుడు దాదాపు 10 లక్షల మంది వచ్చారు. కానీ, వారంతా నేరస్తులకు ఓట్లు వేశారని పవన్ కళ్యాణ్ అన్నారు. బలమైన భావజాలాలు కావాలని, నేరస్తుల్ని ప్రోత్సహించకుండా రాజకీయాలు చేయాలని అని ఆయన చెప్పుకొచ్చారు.

రాజకీయాల్లోకి స్వార్థం కోసం రాలేదని అన్నారు. ఇంత మంది చేత నేను మాటలు అనిపించుకోవల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ చాలా సంతోషంగానే ఉంది. ఎందుకంటే న్యాయం కోసం నిలబడ్డాం. సాయం అడిగిన వాళ్ల కోసం పోరాటం చేశామని పవన్ కళ్యాణ్ అన్నారు. మాట్లాడితే ఎక్కడ దాడులు జరుగుతాయో అని భయపడే వారు కూడా ఉన్నారు. ఇలాంటి సమాజానికి ధైర్యం నూరి పోయడానికే, తానూ పార్టీ పెట్టానని పవన్ కళ్యాణ్ అన్నారు. ఎవరు తిట్టినా, దూషించినా సమయం వచ్చినప్పుడు సమాధానం ఇస్తా అని పవన్ హెచ్చరించారు. 

 

Tags:    

Similar News