Pawan Kalyan Slams AP Govt : జగన్ సర్కార్ పై పవన్ ఫైర్..

Pawan Kalyan Slams AP Govt : ఏపీలో అత్యాచారాలు, మహిళలపై దాడుల అంశాలపైన జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. తాజాగా

Update: 2020-08-04 10:35 GMT
pawan kalyan (File Photo)

Pawan Kalyan Slams AP Govt : ఏపీలో అత్యాచారాలు, మహిళలపై దాడుల అంశాలపైన జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. తాజాగా గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం పరిధిలోని శివాపురం తండాలో గిరిజన మహిళని అధికార పార్టీకి చెందిన ఓ వడ్డీ వ్యాపారి ట్రాక్టర్‌ తో తొక్కించి హత్య చేయడం అమానవీయం అని అన్నారు పవన్ కళ్యాణ్ .. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కల్పించేందుకే దిశ చట్టం తీసుకొద్చాం, దిశ స్టేషన్లు పెట్టాం అని ప్రదారం చేసుకొంటున్న ప్రభుత్వం .. గిరిజన మహిళలపై దాష్టీకాలకు పాల్పడుతున్నా చర్యలు తీసుకొనేందుకు పోలీసులు మీనమేషాలు లెక్కిస్తున్నారని, ప్రచారం తప్ప మహిళల మానప్రాణాలకు రక్షణ లభించడం లేదని మండిపడ్డారు.

ఆ ఘటన తనకి వ్యక్తిగతంగా చాలా బాధను కలిగించిందని, మృతురాలి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నానని అన్నారు. ఇంతటి కిరాతకానికి పాల్పడ్డ ఆ వడ్డీ వ్యాపారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధికార పార్టీ ఆండ ఉండటంతో సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని, ప్రజల ఆందోళనపై ప్రజాస్వామ్యవాదులు, గిరిజన సంఘాలు దృష్టిపెట్టాలని అన్నారు. ఇక కర్నూలు జిల్లా వెలుగోడు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో వాగు వంతెన నిర్మాణపనుల దగ్గర పని చేసే ఓ గిరిజన మహిళపై సామూహిక అత్యాదారం చోటు చేసుకొంటే పోలీసులు కేసు నమోదు చేసుకోలేదని వివిధ మాధ్యమాల ద్వారా తెలిసిందని, భర్త కళ్లెదుటే అత్యాచారం చేశారని బాధితురాలు చెప్పినా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఇక చట్టాలు చేసి ఏమి ప్రయోజనం? అని పవన్ ప్రశ్నించారు.

మహిళకు ఏ కష్టం వచ్చినా ఎక్కడైనా ఫిర్యాదు చేసేలా తమ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని ముఖ్యమంత్రి చెప్పుకొంటున్నా క్షేత్ర స్థాయిలో అమలు కావడం లేదని అన్నారు. ఇక ఇటీవల రాజమండ్రి దగ్గర ఒక దళిత మైనర్‌ బాలికపై సామూహిక అత్యాచారం పైన పవన్ స్పందించారు. తరచూ చోటు చేసుకొంటున్నా పోలీస్‌ శాఖ కఠినంగా వ్యవహరించడం లేదు అంటే వారిపై రాజకీయ ఒత్తిళ్ళు ఏ స్థాయిలో ఉన్నాయో అర్ధం అవుతోందని, దళిత నర్గానికి చెందిన మహిళ హోమ్‌ శాఖ మంత్రిగా ఉన్న రాష్ట్రంలో మహిళలపై ఇలాంటి అమానుషాలు చోటు చేసుకోవడం బాధాకరమని, వారిపైన చర్యలు తీసుకోవాలని పవన్ వాఖ్యానించారు. 



Tags:    

Similar News