టీడీపీపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు రాజకీయాలను దిశానిర్దేశం చేసేది జనసేనేనని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు.

Update: 2020-02-16 13:10 GMT
పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు రాజకీయాలను దిశానిర్దేశం చేసేది జనసేనేనని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో కార్యకర్తలతో పవన్ కళ్యాణ్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో జరుగుతున్న ప్రస్తుత పరిణామాలపై ఆయన పలు కీలక వ్యాఖ్యాలు చేశారు. జనసేన పార్టీ ఉద్యమాలతో ఆగిపోయే పార్టీ కాదనీ, ప్రజల ఆశీస్సులతో అధికారంలోకి వచ్చే పార్టీ అని అభిప్రాయపడ్డారు. వెన్నుపోట్లు , కళ్లు, కుతంత్రాలు ఉంటాయని తెలిసే రాజకీయాల్లో వచ్చానని స్పష్టం చేశారు. ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు కష్టాలైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన అన్నారు.

బీజేపీతో పొత్తు వల్ల ముస్లిం, మైనార్టీలు జనసేనకు దూరమవుతారని కొందరు చెప్పారని, ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలనే లోచించే ముందుకు పొత్తు పెట్టుకున్నాం తప్ప, కొన్ని వర్గాలు దూరమవుతారనే ఆలోచనలతో.. రాజకీయాలు చేయబోనని స్పష్టం చేశారు. వైసీపీ మైనార్టీలకు అనుకూలం అంటూనే వెన్నుపోటు పొడిచిందని ఆరోపించారు. టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు మాజీ పీఎస్ దగ్గర రూ. 2,000 ఆస్తులు కోట్ల ఐటీ దాడుల్లో దొరికాయని దీనిపై స్పందించమని కొందరు అడగ్గా.. జనసేన పార్టీ అవినీతికి వ్యతిరేకమని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు

దివంగత ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు పరిస్థితులు వేరని పవన్ కళ్యాణ్ చెప్పారు. రూ.2 కిలో బియ్యం ఇస్తామని ప్రకటిస్తే ఆయన్ను భారీ మెజారిటీతో గెలిపించారని అన్నారు. ఇప్పుడు సేన చేస్తామంటే శంకించే పరిస్థితులు వచ్చాయని, ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ పార్టీపై కీలక వ్యా్ఖ్యాలు చేశారు. గత ఎన్నికల్లో టీడీపీ దాదాపు 40 శాతం ఓట్లు వచ్చాయని, కానీ ఇప్పుడు రాష్ట్రంలో బలంగా లేదని పవన్ కళ్యాణ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. దానికి కారణం ఆ పార్టీకి వచ్చిన ఓట్లు డబ్బుతో కొనుక్కున్నవి కావడమని తెలిపారు. జనసేనకు వచ్చిన ఓట్లు మార్పు కోసం వేసినవని తెలిపారు. అందుకే ఓడిపోయినా ప్రజల తరఫున బలంగా పోరాటాలు చేయగలుగుతున్నామని చెప్పారు. అమరావతి విషయంలో టీడీపీ వెనకబడిపోయినా.. ఆ ఉద్యమాన్ని జనసేన ముందుకు తీసుకెల్తోందని అన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో నైతికంగా జనసేన పార్టీ ఓడిపోలేదని తెలిపారు.

రాజకీయాలు కులాల మధ్య గొడవలుగా మారయని సంచలన వ్యాఖ్యలు చేశారు. మనల్ని పరిపాలించే పాలకులు కులాల పేరుతో తిట్టుకుంటున్నారని విమర్శించారు. ఇలాంటి సంస్కృతి పోవాలంటే యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. అన్ని కులాలు, మతాలు, ప్రాంతాలు బాగుండాలని జనసేనకు కోరుకుంటుందని పవన్ కళ్యాణ్ అన్నారు.

  

Tags:    

Similar News